Telugu Global
Others

బాబు భద్రత ఎందుకు మారిందంటే...!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత బాధ్యతలు చూసే పోలీసు అధికారులందరినీ మార్చారు. కొత్తవారు వచ్చారు. అందులో వింతేముంది? వచ్చినవారెవరు? అంతకు ముందు ఆ బాధ్యతలు ఎవరు చూసేవారు?ఇప్పటి వరకు హైదరాబాద్‌లో చంద్రబాబు భద్రతా బాధ్యతలను తెలంగాణ పోలీసు అధికారులే చూసేవారు. ఇపుడు ఆంధ్రాపోలీసు అధికారులు ఆ బాధ్యతలు చేపట్టారు. కొండాపూర్ బెటాలియన్ పోలీసుల స్థానంలో కర్నూలు బెటాలియన్ పోలీసులు వచ్చి చేరారు. ఓటుకు కోట్లు ఉదంతం తర్వాత కెసిఆర్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం […]

బాబు భద్రత ఎందుకు మారిందంటే...!?
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత బాధ్యతలు చూసే పోలీసు అధికారులందరినీ మార్చారు. కొత్తవారు వచ్చారు. అందులో వింతేముంది? వచ్చినవారెవరు? అంతకు ముందు ఆ బాధ్యతలు ఎవరు చూసేవారు?ఇప్పటి వరకు హైదరాబాద్‌లో చంద్రబాబు భద్రతా బాధ్యతలను తెలంగాణ పోలీసు అధికారులే చూసేవారు. ఇపుడు ఆంధ్రాపోలీసు అధికారులు ఆ బాధ్యతలు చేపట్టారు. కొండాపూర్ బెటాలియన్ పోలీసుల స్థానంలో కర్నూలు బెటాలియన్ పోలీసులు వచ్చి చేరారు. ఓటుకు కోట్లు ఉదంతం తర్వాత కెసిఆర్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.అందుకే చంద్రబాబు అలకబూని ఆంధ్రా పోలీసులను రప్పించుకున్నారు. ఇది పైకి అందరూ చెబుతున్న మాట. కానీ అసలు విషయం వేరే ఉంది. తెలంగాణ పోలీసు అధికారుల వల్ల అన్నీ బైటకు పొక్కి పోతున్నాయని చంద్రబాబు భయపడుతున్నారు. తనను ఎవరు కలుస్తున్నారు? ఎప్పుడు కలుస్తున్నారు? అనే విషయాలు తెలంగాణ ప్రభుత్వానికి సులువుగా తెలిసిపోతున్నాయని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ఆయన తెలంగాణ అధికారులను, పోలీసులను మార్చేశారు. తనకు నమ్మకస్తులైన ఆంధ్రా పోలీసు అధికారులను తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ అనురాధపైన కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారట. ఓటుకు కోట్లు వ్యవహారం బైటకు పొక్కిపోయినా తనపైన, తమ పార్టీ ఎమ్మెల్యేలపైన ఏసీబీ నిఘా ఉంచినా ఆ విషయాలేవీ కనిపెట్టలేకపోయారని ఆయన ఆంధ్రా ఇంటెలిజెన్స్ అధికారులపై గుర్రుగా ఉన్నారని సమాచారం.

First Published:  10 Jun 2015 3:51 AM GMT
Next Story