Telugu Global
Cinema & Entertainment

బ్రాండీ బ్రాండుతో రచ్చ రచ్చ చేయనున్న రవి తేజ!

రవి తేజ అంటేనే ఒక ఎనర్జీ..ఒక పవర్. పేరు వింటేనే ఒక కిక్ తెలుగు ప్రేక్షకులకి. మాస్ మహారాజా అనే బిరుదుకి అచ్చమైన నిర్వచనం అతను. ఇక ఈ మాస్ … రెండు పవర్‌ఫుల్ పెగ్గులేస్తే ఎలా రెచ్చిపోతాడో మనకు మాత్రం తెలియదు కాని ఎన్నో సినిమాల్లో మాత్రం చూసేసాం. మొన్నీ మధ్యనే ఒక చెప్పుల బ్రాండ్‌కి అంబాసిడర్‌గా అడ్వర్‌టైజ్‌మెంట్ షూట్ చేసాడు రవి తేజ. ఇప్పుడింకా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. కొత్తగా ‘లార్డ్స్ & మాస్టర్ […]

బ్రాండీ బ్రాండుతో రచ్చ రచ్చ చేయనున్న రవి తేజ!
X

రవి తేజ అంటేనే ఒక ఎనర్జీ..ఒక పవర్. పేరు వింటేనే ఒక కిక్ తెలుగు ప్రేక్షకులకి. మాస్ మహారాజా అనే బిరుదుకి అచ్చమైన నిర్వచనం అతను. ఇక ఈ మాస్ … రెండు పవర్‌ఫుల్ పెగ్గులేస్తే ఎలా రెచ్చిపోతాడో మనకు మాత్రం తెలియదు కాని ఎన్నో సినిమాల్లో మాత్రం చూసేసాం. మొన్నీ మధ్యనే ఒక చెప్పుల బ్రాండ్‌కి అంబాసిడర్‌గా అడ్వర్‌టైజ్‌మెంట్ షూట్ చేసాడు రవి తేజ.

ఇప్పుడింకా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. కొత్తగా ‘లార్డ్స్ & మాస్టర్ ‘ అనే బ్రాండీ బ్రాండ్‌కి ఎండార్స్‌మెంట్ చేయనున్నాడు. అందుకోసం ఒక వ్యాపార ప్రకటన షూటింగ్‌లో సైతం పాల్గొన్నాడు. కాని ఇంతకు ముందు ఇలాంటి లిక్కర్ బ్రాండ్‌లకు ఎండార్స్ చేసిన స్టార్స్ అందరూ, అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నారని కాంట్రవర్సీ ఎదుర్కున్నారు… మరి మన మాస్ మహారాజ బ్రాండీ ప్రకటన ఎలా ఉంటుందో! ఏం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే!

First Published:  10 Jun 2015 4:59 AM GMT
Next Story