Telugu Global
Cinema & Entertainment

షాహిద్ కపూర్ పెళ్లికి రంగం సిద్ధం

గతంలో కరీనా కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు షాహిద్ కపూర్. ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రేమప్రయాణం చేశారు. కానీ ఉన్నట్టుండి కరీనా, సైఫ్ కు దగ్గరైంది. ఆ తర్వాత అతడ్నే పెళ్లాడ్డం.. షాహిద్ భగ్న ప్రేమికుడిగా మిగిలిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా గతం. చాలా ఏళ్ల నాటి కథ. ఆనాటి విషయాల్ని మరిచిపోయిన షాహిద్, ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని ఇంట్లో వాళ్లు సెలక్ట్ చేశారు. […]

షాహిద్ కపూర్ పెళ్లికి రంగం సిద్ధం
X
గతంలో కరీనా కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు షాహిద్ కపూర్. ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రేమప్రయాణం చేశారు. కానీ ఉన్నట్టుండి కరీనా, సైఫ్ కు దగ్గరైంది. ఆ తర్వాత అతడ్నే పెళ్లాడ్డం.. షాహిద్ భగ్న ప్రేమికుడిగా మిగిలిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా గతం. చాలా ఏళ్ల నాటి కథ. ఆనాటి విషయాల్ని మరిచిపోయిన షాహిద్, ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని ఇంట్లో వాళ్లు సెలక్ట్ చేశారు. ఆ అమ్మాయినే త్వరలో పెళ్లాడబోతున్నాడు షాహిద్. అయితే పెళ్లికి సంబంధించి విషయాల్ని మాత్రం మీడియాకు దూరంగా ఉంచుతున్నాడు. వచ్చేనెల 8 లేదా 10న షాహిద్ పెళ్లిచేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే 2 రోజుల ముందు సంగీత్ ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి. వీటిపై స్పందించడానికి షాహిద్ తో పాటు అతడి కుటుంబ సభ్యులెవరూ అందుబాటులోకి రావడం లేదు. జులై మొదటివారంలో పెళ్లి వార్తను గ్రాండ్ గా అందరికీ చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడట షాహిద్. అందుకే ఇలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు.
First Published:  9 Jun 2015 11:29 PM GMT
Next Story