బాబుకు నిరాశ తప్పదా!

ఓటుకు కోట్లు వ్యవహారంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నుంచి కేంద్రం నివేదిక కోరడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి, తనకు అత్యంతసన్నిహితుడైన వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఆయన అన్ని మార్గాలనుఅన్వేషిస్తున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా చంద్రబాబు కలుసుకుని కేసీఆర్‌పై ఫిర్యాదుచేయాలని యోచిస్తున్నారు. ‘హైదరాబాద్ నీ అబ్బ జాగీరా’ వంటి పరుష పదజాలాన్ని వాడుతున్నారని రాజ్‌నాథ్‌కువివరించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హస్తినకుపయనమవుతున్నారు. కేంద్రంలోని ముఖ్యులతో ఆయన అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయని సమాచారం. ఓటుకు కోట్లువ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి అనైతిక పధ్దతులకు పాల్పడ్డారో సాక్ష్యాలతో సహా వివరించేందుకు కేసీఆర్సిద్ధమవుతున్నారు. చంద్రబాబును ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం తథ్యమని, ఆయనను అరెస్టు చేస్తే తలెత్తేపరిణామాలను ఎలా ఎదుర్కొంటామో వివరించేందుకే కేసీఆర్ ఢిల్లీ పయనమవుతున్నారని తెలంగాణ అధికారవర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే ఇద్దరు చంద్రుల కన్నా ముందే హస్తిన చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు,వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని చంద్రబాబునుఅరెస్టు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం గురించి ఆయన రాష్ర్టపతికివివరించినట్లు తెలుస్తోంది.