Telugu Global
NEWS

రెండేళ్లలో తాగునీరు అందిస్తాం: సీఎం కేసీఆర్

మహబూబ్‌నగర్ జిల్లాలోని కరివెన, వెట్టంలకు రెండేళ్లలోపు నీటిని తెస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటనలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండలం కరివెనలో ఏర్పాటు చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ముంపు వాసులపై వరాలు కురిపించారు. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. పరిహారం అవసరం లేదనుకున్నవారికి ఎంత ఖర్చయినా రైతులు కోరుకున్న చోట భూములు కొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు. రూ.35 వేల […]

రెండేళ్లలో తాగునీరు అందిస్తాం: సీఎం కేసీఆర్
X
మహబూబ్‌నగర్ జిల్లాలోని కరివెన, వెట్టంలకు రెండేళ్లలోపు నీటిని తెస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటనలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండలం కరివెనలో ఏర్పాటు చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ముంపు వాసులపై వరాలు కురిపించారు. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. పరిహారం అవసరం లేదనుకున్నవారికి ఎంత ఖర్చయినా రైతులు కోరుకున్న చోట భూములు కొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు. రూ.35 వేల 200 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. నాలుగేళ్ల లోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మూడు తండాలు పోతున్నాయని ముంపు బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ముంపు బాధితులకు ఎంత ఖర్చు అయినా భూమి ఇస్తామని పేర్కొన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అందరం కష్ట పడాలని పిలుపిచ్చారు. మొండిగా కూర్చుంటే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభిస్తారని అడ్డంకులు కలిగించవద్దని కోరారు. ముంపు బాధితుల కుటుంబాలకు ప్రతి ఇంటికి ఉద్యోగం, భూమి ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులను చేపడతామని చెప్పారు.
First Published:  11 Jun 2015 4:57 AM GMT
Next Story