Telugu Global
Cinema & Entertainment

అభిమానికి బుద్ధిచెప్పిన హీరోయిన్...

ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌స్‌లో అమ్మాయిలను సెక్సిస్ట్ కామెంట్స్‌తో ఏడిపించడం చాలా కామన్ అయిపోయింది. ఇక సినీ సెలెబ్రిటీల సంగతి చెప్పనే అక్కరలేదు. యాక్ట్రెస్‌లు తమ సొంత ప్రాపర్టీ అన్నట్లు ప్రవర్తించేవారే ఎక్కువ అయ్యారు. నారా రోహిత్ ‘రౌడీ ఫెల్లో ‘ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలివుడ్ నటి విశాఖ సింగ్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో తాను టీ-షర్ట్ వేసుకున్న ఒక పిక్ పోస్ట్ చేసింది. అది చూసి ‘నైస్ బూబ్స్ ‘ […]

అభిమానికి బుద్ధిచెప్పిన హీరోయిన్...
X

ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌స్‌లో అమ్మాయిలను సెక్సిస్ట్ కామెంట్స్‌తో ఏడిపించడం చాలా కామన్ అయిపోయింది. ఇక సినీ సెలెబ్రిటీల సంగతి చెప్పనే అక్కరలేదు. యాక్ట్రెస్‌లు తమ సొంత ప్రాపర్టీ అన్నట్లు ప్రవర్తించేవారే ఎక్కువ అయ్యారు. నారా రోహిత్ ‘రౌడీ ఫెల్లో ‘ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలివుడ్ నటి విశాఖ సింగ్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో తాను టీ-షర్ట్ వేసుకున్న ఒక పిక్ పోస్ట్ చేసింది. అది చూసి ‘నైస్ బూబ్స్ ‘ అంటూ ఆమె వక్షోజాలను కామెంట్ చేసాడు ఒకడు.

వెంటనే కోపంతో విశాఖ అతనికి సరైన రిటార్ట్ ఇచ్చింది. ‘అవును నేను స్త్రీని కనుక నాకు బూబ్స్ (వక్షోజాలు) ఉంటాయి. మీ అమ్మ, చెల్లెలు, భార్య, స్నేహితులు మరియు చుట్టాలలో ఆడవారందరికీ బూబ్స్ ఉంటాయి. వారి దగ్గరికి వెళ్ళి ‘నైస్ బూబ్స్ ‘ అని చెప్పు అని చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. అంతే కాదు, అతడు డిస్‌ప్లే పిక్‌గా అమాయకమైన చిన్నారి పిక్ తీసేసి, తన స్వంత పిక్ పెట్టుకుని, డైరెక్ట్‌గా మాట్లాడే దమ్ముందా అని సవాల్ విసిరింది. భళా విశాఖ భళా! ఇంతకీ విశాఖ పోస్ట్ చేసిన పిక్చర్ కేవలం నిండుగా ఉన్న టీ షర్ట్ వేసుకున్న పిక్. అందులో ఆమె రివీలింగ్‌గా ఏమీ లేదు.

First Published:  11 Jun 2015 12:56 AM GMT
Next Story