Telugu Global
Others

చంద్ర‌బాబు మమ్మల్ని ఏమి చేయలేడు: కేసీఆర్‌

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోయి ఉన్నారని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుంటున్నారని, తనకు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఓటుకు నోటు కేసుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ కేసులో చంద్రబాబుకు.. మోడీ మద్దతిస్తారని తాను అనుకోవడం లేదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో […]

చంద్ర‌బాబు మమ్మల్ని ఏమి చేయలేడు: కేసీఆర్‌
X

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోయి ఉన్నారని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుంటున్నారని, తనకు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఓటుకు నోటు కేసుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ కేసులో చంద్రబాబుకు.. మోడీ మద్దతిస్తారని తాను అనుకోవడం లేదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోందని తెలిపారు. ‘‘చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత కథ ఎందుకు? నీ సమస్యను ప్రజల సమస్యగా ఎందుకు మారుస్తావు’’ అని చంద్రబాబు నుద్దేశించి కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు బహిరంగంగా దొరికిన దొంగ అని నిప్పులు చెరిగారు. ‘‘ నువ్వు కాదు నీ తాత జేజమ్మ కూడా మమ్మల్ని ఏమి చేయలేరు’’ అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుమ్మక్కులు, కుంభకోణాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని విమర్శించారు. ‘‘గొర్రెలు కాసే బతుకు ఎవరిది నీదా నాదా?’’ అని బాబుపై కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను అడ్డదారిలో ఎత్తుకుపోయారని మండిపడ్డారు. చంద్రబాబు దురాశకు ఇక అంతులేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత ఏ పార్టీలో గెలిచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించారు. కోన రఘుపతి, గొట్టిపాటి రవికుమార్‌, ముస్తాఫా, జలీల్‌ఖాన్‌, ఉప్పులేటి కల్పన, వెంకటరమణ, కృష్ణమోహన్‌ గెలిచింది ఏ పార్టీ… వీళ్లున్నది ఏ పార్టీ అని నిలదీశారు. వైసీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోలేదా? చంద్రబాబు పార్టీలోకి చేర్చుకుంటే ఓ నీతి..టీఆర్‌ఎస్‌లో చేరితే అవినీతా? అని దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో చంద్రబాబు అతిథి ముఖ్యమంత్రి మాత్రమే అన్న కేసీఆర్ ఏపీ డీజీపీ పరిధి ఆ రాష్ట్రం వరకే ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో ఎందుకు దందా పెట్టావు? ఇలాగే వదిలేస్తే మా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తావు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అయితే పైసలు పెట్టి కొంటావా? ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీడీపీ కొన్నట్టు సమాచారముంది. కాంగ్రెస్‌ సన్నాసులను నేనే అలర్ట్‌ చేశా.’’ అని కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హవాలా కోణం ఉందా లేదా అనేది తెలియదు సీఎం తెలిపారు. గాండ్రింపులు చేసినంత మాత్రాన.. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని కేసీఆర్ తేల్చి చెప్పారు. ‘‘అయినా చంద్రబాబును నేనెందుకు అరెస్ట్‌ చేస్తా..ఏసీబీ ఉంది కదా’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని కేంద్రం అమలు చేస్తే ముఖానికి మసి పూసుకున్నట్లే నని వ్యాఖ్యానించారు. కర్మ కాలి అమలు చేసినా ఏసీబీ దాని పరిధిలోకి రాదని సీఎం తెలిపారు. చంద్రబాబు సొంత సెక్యూరిటీపై… తెలంగాణ డీజీపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని సీఎం తెలిపారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు కేంద్రం సపోర్ట్‌ చేస్తుందనుకోవడం లేదన్నారు.

First Published:  10 Jun 2015 8:48 PM GMT
Next Story