Telugu Global
Others

రక్తి కడుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయం..!

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ర్టాల్లోనూ ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేసే ప‌ని నిర్విఘ్నంగా కొన‌సాగుతోంది. రెండు రాష్ర్టాల్లోనూ అధికార పార్టీల‌కు సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆయా ప్ర‌భుత్వాల‌కు వ‌చ్చిన ప్ర‌మాద‌మేదీ లేదు. అయినా ఎక్క‌డో అనుమానం, ఏదో అభ‌ద్ర‌తాభావం. తామున్నంత కాలం ప్ర‌తిప‌క్షం నోరు మెద‌ప‌డానికి వీల్లేద‌నుకునే నిరంకుశ‌, అహంకార పూరిత‌, అధికార మ‌దం అనుకోవాలి.            ఏపీలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మె‌ల్యేల‌ను, ఎంపీల‌ను కొనే ప్ర‌క్రియ‌కు తెర […]

రక్తి కడుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయం..!
X
ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ర్టాల్లోనూ ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేసే ప‌ని నిర్విఘ్నంగా కొన‌సాగుతోంది. రెండు రాష్ర్టాల్లోనూ అధికార పార్టీల‌కు సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆయా ప్ర‌భుత్వాల‌కు వ‌చ్చిన ప్ర‌మాద‌మేదీ లేదు. అయినా ఎక్క‌డో అనుమానం, ఏదో అభ‌ద్ర‌తాభావం. తామున్నంత కాలం ప్ర‌తిప‌క్షం నోరు మెద‌ప‌డానికి వీల్లేద‌నుకునే నిరంకుశ‌, అహంకార పూరిత‌, అధికార మ‌దం అనుకోవాలి.
ఏపీలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మె‌ల్యేల‌ను, ఎంపీల‌ను కొనే ప్ర‌క్రియ‌కు తెర తీసింది. అంతేగాకుండా స్థానిక సంస్థ‌ల్లో ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికారంలో ఉన్న చోట ప్ర‌లోభాల‌తో వారి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను టీడీపీలోకి ర‌ప్పించుకుని కొన్ని జిల్లా ప‌రిష‌త్‌లు, మున్సిపాలిటీల‌పై తెలుగుదేశం స్టాంప్ వేసుకుంది. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల‌ను న‌యానో, భ‌యానో, ప్ర‌లోభాలు చూపించో టీఆర్ఎస్‌ గూటికి ర‌ప్పించుకున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఎమ్మ‌ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌లోభాల ప‌ర్వం తారాస్థాయికి చేరింది. పోలింగ్‌కు మూడు రోజుల ముందు కూక‌ట్‌ప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్ళి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ప‌రిణామాల అనంత‌రం టీడీపీ అభ్య‌ర్థికి ఓటేయ‌డానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు 50 ల‌క్ష‌లు ఇస్తూ రేవంత్ రెడ్డి ఏసీబీ ఆప‌రేష‌న్‌లో అడ్డంగా దొరికిపోయాడు.
రేవంత్ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు పాత్ర కూడా ఉన్న‌ట్లు ఆడియో టేపుల‌తో వార్త‌లు బ‌య‌ట‌కు పొక్కాక ఈ క్రైం థ్రిల్ల‌ర్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సీన్ ఢిల్లీకి మారింది. చంద్ర‌బాబు ఆడియో టేపుల విష‌యంలో తెలుగుదేశం నాయ‌కులు, మంత్రులు అనేక పిల్లిమొగ్గ‌లు వేశారు. ఆ గొంతు బాబుది కాద‌ని కొంద‌రు..అక్క‌డ‌క్క‌డా బాబు మాట్లాడిన మాట‌ల్ని అతికించి త‌యారు చేశార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. మా ఫోన్లు ఎలా ట్యాప్ చేస్తారంటూ మ‌రికొంద‌రు ద‌బాయిస్తున్నారు. స్టీఫెన్‌స‌న్‌తో మాట్లాడ‌లేద‌ని చంద్ర‌బాబు లై డిటెక్ట‌ర్
టెస్ట్‌కు అంగీక‌రిస్తారా తెలంగాణ మంత్రి కేటీ రామారావు వేసిన ప్ర‌శ్న‌కు తెలుగుదేశం శిబిరం నుంచి స‌మాధానం రాలేదు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఆడియోల టేపులో గొంతు త‌న‌ది కాద‌ని మాత్రం చెప్ప‌లేదు. మా ఫోన్లు ట్యాప్ చేయ‌డం అక్ర‌మం, నేర‌మ‌నే అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని ఢిల్లీ పెద్ద‌ల‌ను వేడుకున్నారు. తెలంగాణ‌లో ఒక్క ఎమ్మెల్సీ రాక‌పోతే త‌న పార్టీకి ఏమ‌న్నా న‌ష్ట‌మా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ వ్య‌వ‌హారాన్ని ఖండించ‌డం గాని..స‌మ‌ర్థించ‌డం కాని చేయ‌లేదు. అది వేరే రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హార‌మంటూ తేల్చేశారు.
First Published:  10 Jun 2015 11:33 PM GMT
Next Story