ఆపిల్ పిల్లకు మరోసారి ఒకే అన్న అల్లు అర్జున్ 

ఆపిల్ పిల్ల హన్సికను హీరోయిన్ గా మార్చింది అల్లు అర్జునే. దేశముదురు సినిమాతో హన్సికకు ఛాన్స్ ఇచ్చాడు. బన్నీ చేతిచలవతో హన్సిక ఇప్పుడు స్టార్ అయింది. కోలీవుడ్ లో చక్రం తిప్పుతోంది. అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తున్నప్పటికీ వాటితో కూడా హిట్స్ అందుకుంటోంది. మళ్లీ ఇన్నాళ్లకూ బన్నీ-హన్సిక కాంబినేషన్ సెట్ అయింది. దేశముదురు తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించే ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. అదే బోయపాటి శ్రీను సినిమా. అవును.. బోయపాటి-బన్నీ కాంబోలో రాబోతున్న సినిమాలో హన్సికను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. కథ ప్రకారం బన్నీ సరసన ఓ కొత్తమ్మాయి అయితే బాగుంటుందని అంతా అనుకున్నారు. బన్నీ కూడా ఆ యాంగిల్ లోనే ఆలోచించాడు. అయితే హన్సికతో వర్క్ చేసి చాన్నాళ్లయింది కాబట్టి.. తమ కాంబినేషన్ కచ్చితంగా కొత్తగా కనిపిస్తుందనే ఉద్దేశంతో, బోయపాటికి బన్నీనే హన్సిక పేరు ప్రపోజ్ చేశాడు. అలా బన్నీ సినిమాలో మరోసారి నటించే అవకాశం అందుకుంది హన్సిక. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి బిజీ అయిపోవాలని చూస్తోంది ఆపిల్ పిల్ల.