Telugu Global
Cinema & Entertainment

జ్యోతి లక్ష్మి మూవీ రివ్యూ

సినిమా చరిత్రలో జ్యోతిలక్ష్మిది ఒక అధ్యాయం. అదే జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా వస్తోందంటే తప్పకుండా ఎటెన్షన్‌ ఉంటుంది. అందులో పూరిజగన్నాద్‌ దర్శకుడిగా చార్మి సమర్పణలో సినిమా రాకముందే అందరి దృష్టిని ఆకర్షించింది.  సికె ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియూ శుభస్వేతా ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా ముందే ప్రచారం అయింది. పైగా నిర్మాత సి. కళ్యాణ్‌తో పాటు చార్మి నిర్మాతగా జ్యోతిలక్ష్మి చిత్రాన్ని నిర్మించడం సినీ వర్గాల్లో కొంత ఆసక్తిని రేకెతించింది.     […]

జ్యోతి లక్ష్మి మూవీ రివ్యూ
X
సినిమా చరిత్రలో జ్యోతిలక్ష్మిది ఒక అధ్యాయం. అదే జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా వస్తోందంటే తప్పకుండా ఎటెన్షన్‌ ఉంటుంది. అందులో పూరిజగన్నాద్‌ దర్శకుడిగా చార్మి సమర్పణలో సినిమా రాకముందే అందరి దృష్టిని ఆకర్షించింది. సికె ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియూ శుభస్వేతా ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా ముందే ప్రచారం అయింది. పైగా నిర్మాత సి. కళ్యాణ్‌తో పాటు చార్మి నిర్మాతగా జ్యోతిలక్ష్మి చిత్రాన్ని నిర్మించడం సినీ వర్గాల్లో కొంత ఆసక్తిని రేకెతించింది.
45 ఏళ్ళ క్రితం మల్లాది వెంకటక్రిష్ణమూర్తి రాసిన “మిసెస్‌ పరాంకుశం” నవల ఈ చిత్ర కథకు ఆధారం. 25 ఏళ్ళ క్రితమే సినిమాగా తీయాలి అనుకొని 10 ఏళ్ళ క్రితం రచయితను అడిగి 6 ఏళ్ళ క్రితం చార్మితో చేద్దామనుకొని ఇప్పటికి “జ్యోతిలక్ష్మి”గా మన ముందుకు తీసుకొచ్చారు పూరీజగన్నాద్‌.
“కుటుంబంలో మగవాళ్ళు ఫెయిల్‌ అయినచోట వేశ్యలు పుడతారు. సొసైటీ ఫెయిల్‌ అయితేనే వేశ్యలు పుడతారు” అని భావించి వేశ్య వృత్తి కేంద్రంగా నడిచిన కథ ఇది. జ్యోతిలక్ష్మి (చార్మి) గంగాబాయి కంపెనీలో ఒక వేశ్య. చాలామందికి తెలిసిన వేశ్య అయితే సత్య(సత్య) ఆ బ్రోతల్‌ హౌస్‌కు వెతుకుంటూ వచ్చి ఆమెను ఇష్టపడి ఐలవ్యూ చెబుతాడు. ఆ మాట బూతులా ఉందంటూ నవ్వేసి చిలిపిగా అల్లరిగా సత్యని ఆటపట్టిస్తుంది జ్యోతిలక్ష్మి. నీ కోసం ఏడ్చి ఎదురుచూసే అమ్మాయిని పెళ్ళిచేసుకొమ్మని సలహా ఇస్తుంది. అయినా సత్య ఆమె శరీరాన్ని వాంచించి కాకుండా పెళ్ళిచేసుకుంటానంటాడు. నీకు పైత్యం ముదిరిందని, ఒక ఎఫైర్‌ ఉంటేనే మీ మాగాళ్ళు తట్టుకోలేరని తనకు చాలా ఎఫైర్స్‌ ఉన్నాయని వద్దని వారిస్తుంది. అయితే జ్యోతిలక్ష్మిని ఆ బ్రోతల్‌ హౌస్‌ నుంచి సత్య బయటకి తీసుకెళ్ళాలని తనకోసం నిర్వాహకులతో దెబ్బలు తినడంతో అతని మాటకు అవునంటుంది. అయితే జ్యోతిలక్ష్మిని కరెంట్‌ ఆఫ్‌ చేసి బ్రోతల్‌ హౌస్‌నుంచి సులువుగా తప్పించడమే కాదు, అమాయకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ప్రొటక్షన్‌ కోరుతాడు. అయితే ఎస్‌ఐ, బ్రోకరు ప్రెండ్‌ అంతా చంపేస్తారని హెచ్చరించినా సత్య జ్యోతిలక్ష్మినే పెళ్ళిచేసుకుంటాడు. కండోమ్‌ వాడలేదని తాళి తెంపేస్తుంది జ్యోతిలక్ష్మి. తరువాత తాళి ఎంత గౌరవప్రదమో, స్త్రీకి ఎంత అవసరమో కొన్ని అనుభవాలతో తెలుసుకొని తిరిగి తాళి కట్టించుకుంటుంది. అయితే జ్యోతిలక్ష్మిని ఎత్తుకు పోయినందుకు గాను బ్రోతల్‌ హౌస్‌ నిర్వాహకులు సత్యని చావగొడతారు. భర్త సత్యని రక్షించుకొని బందీలుగా ఉన్న తన తోటి స్త్రీలను ఎలా కాపాడగలిగింది అన్నదే తెర మీద చూడాల్సిన మిగతా కథ…!
చాలా వాస్తవ సమస్యని కథగా తీసుకొని దానిని అంతే వాస్తవంగా డీల్‌ చేయకుండా సినిమాటిక్‌గా చిత్రాన్ని నడపడం వినోదం కన్నా విషాదమే. అయితే వేశ్యలను అరెస్టు చేసే పోలీసులు విటులను వదిలేయడం గురించి కథానాయక పాత్రద్వారా ప్రశ్నించడమే కాదు, కథలో భాగంగా ఆ విటుల్ని కెమెరాలద్వారా జరుగుతున్న తంతును రికార్డు చేసి వేశ్యవృత్తిలో ఉన్నవారికి బయటపడాలనుకునేవారికి ఒక మార్గం చూపిస్తాడు దర్శకుడు. కథ పాతదైనప్పటికి ఇప్పటికీ నడుస్తున్న కథే…! మాటలు పండాయి. సంగీతం సందర్భోచితంగా బాగుంది. చార్మి సత్యల నటన బాగుంది. వచ్చిపోయే విటుడిగా బ్రహ్మానందాన్ని గుర్తుపెట్టుకోలేం. ఇలాంటి కథను ఎన్నుకొనేటప్పుడు కాస్తంత రియలిస్టిక్‌గా కథను చివరివరకు డీల్‌ చేసివుంటే పాప్‌కార్న్‌గా మిగలకుండా పోషకాహారంగా జనంకి అంది ఉండేది. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ ప్లస్‌ పొలిటికల్‌ లింకులు స్త్రీ శరీరం మీద కోట్లకొద్ది బిజినెస్‌ జరుగుతూ ఉన్న అనేక వాస్తవ అంశాలను లింకు చేసి వాస్తవంగా మలిచి ఉంటే చిత్రానికి ప్రయోజనం ఉండి ఉండేది.
రేటింగ్‌: 3/5
First Published:  12 Jun 2015 2:44 AM GMT
Next Story