Telugu Global
Cinema & Entertainment

కేరింత రివ్యూ

రేటింగ్: 2.75/5 పునః వైభవం రావాలంటే పునః చిత్రాలనే నిర్మించాలని కొత్త సూత్రం! విజయానికి దగ్గరి సూత్రం! అపజయాలను అడ్డగించే సూత్రం! ”కేరింత” చూస్తున్నప్పుడు “హ్యాపీ డేస్” గుర్తుకు రాక మానదు. అయితే అనువాద చిత్రం కాదు గనుక మక్కికి మక్కీ గా వుండకుండా తనదైన వ్యక్తిత్వాన్ని యివ్వడానికి ప్రయత్నిచారు. అందులోని సున్నితత్వం.. యవ్వనత్వం.. ఎంతోకొంత ఆకట్టుకొనేలా వుండి ముఖ్యంగా కుర్రకారుని డ్రైవ్ చేస్తుంది. సేఫ్ డ్రైవింగ్ మాట అటుంచి అచ్చం హ్యాపీ డేస్ లానే కాలేజ్ చదువులు.. గతించిన ప్రేమల అవరోధాల ఘర్షణల జ్ఞాపకాలు.. […]

కేరింత రివ్యూ
X

రేటింగ్: 2.75/5

పునః వైభవం రావాలంటే పునః చిత్రాలనే నిర్మించాలని కొత్త సూత్రం! విజయానికి దగ్గరి సూత్రం! అపజయాలను అడ్డగించే సూత్రం! ”కేరింత” చూస్తున్నప్పుడు “హ్యాపీ డేస్” గుర్తుకు రాక మానదు. అయితే అనువాద చిత్రం కాదు గనుక మక్కికి మక్కీ గా వుండకుండా తనదైన వ్యక్తిత్వాన్ని యివ్వడానికి ప్రయత్నిచారు. అందులోని సున్నితత్వం.. యవ్వనత్వం.. ఎంతోకొంత ఆకట్టుకొనేలా వుండి ముఖ్యంగా కుర్రకారుని డ్రైవ్ చేస్తుంది. సేఫ్ డ్రైవింగ్ మాట అటుంచి అచ్చం హ్యాపీ డేస్ లానే కాలేజ్ చదువులు.. గతించిన ప్రేమల అవరోధాల ఘర్షణల జ్ఞాపకాలు.. నేరేట్ చేస్తూ నడుస్తూ కథ మనల్ని ముందుకు తీసుకు వెళుతుంది. చివరకు సమస్యలూ భయాలూ అనుమానాలూ తీరి అర్థం చేసుకోవడంలో స్నేహం ప్రధాన భూమికగా ప్రేమల్ని పండిస్తాయి.

హ్యాపీనెస్ ని ఎక్కడుంటే అక్కడ వైరస్ లా వ్యాప్తి చేసే జయ్ (సుమంత్ అశ్విన్). అతన్నీ అతని ప్రేమని ఎంకరేజ్ చేసే పాజిటివ్ పేరెంట్స్. మ్యూజిక్ అన్నా ప్రియ (తేజేస్వి) అన్నా ఇష్టపడి తల్లి భయంతో అబద్దాలు చెప్పే సిద్దార్థ్(విశ్వనాథ్). ఇతడికి పోలీసింగ్ చేసే ప్రిన్సిపాల్ తల్లి. శ్రీకాకుళం నుండి చదువుకోవడానికి వచ్చి గుంటలకోసం తప్ప తాకట్టుపెట్టి చదివించే తలిదంద్రులకోసం ఆలోచనలేని నూకరాజు(పార్వతీశం). ఈ నూకరాజే కథను చెప్తూ నడిపిస్తూ వుంటాడు. చక్కగా చదువుకొని స్నేహితులు తనవాళ్ళనుకొనే భావన(సుకృతి). యూఎస్ నుండి వచ్చి ప్రేమలోని హానెస్టీని ప్రేమించే ప్రియ. ఇక కాలేజ్ బయట ఆస్ట్రియా వెళ్లి రిసెర్చి చేయాలనుకొనే డాక్టర్ మనస్విని(దివ్య). నిజమైన ప్రేమ వున్నా దాన్నిఅబద్దాలతో నిలబెట్టి ఓడిపోయిన సిద్దార్దూ – అజ్ఞానంతో తనపట్ల ప్రేమనీ స్నేహాన్ని కేరింగ్ నీ చూపే భావనని అర్థం చేసుకోలేక అవస్తపడ్డ నూకరాజూ – థాట్స్, ఆలోచనా కెరీర్ అనుకొని తనని కాదన్న మనస్విని మనసులో తానూ వున్నానని నమ్మిన జయ్ – వీల్లంతా చివరకు తమ తమ ప్రేమల్ని ఎల్లా గెలిచారో తెర మీద చూడాల్సిన మిగతా కథ!

అశ్విన్ నటన మామూలే. దివ్యకు అవకాశం లేదు. సుకృతి, తేజస్వి పాత్రల్లో ఇమిడిపోయారు. విశ్వనాథ్ పార్వతీశం పరవాలేదనిపించారు. మిక్కి జె మేయర్ సంగీతం తన శైలిలో వుంది. మాటలు బావున్నాయి. సాయి కిరణ్ అడవి మునిపటి చిత్రాల కన్నా దర్శకత్వ భాద్యతల్ని మెరుగు చేసుకున్నాడు. అయితే కథలోకి కథానాయిక ఆలస్యంగా ట్రావెల్ చెయ్యడం కథని కాస్త బలహీన పరిచింది. ఇక తెలంగాణా మాండలికాన్ని సినిమాల్లో పెట్టె చాన్సులేదని శ్రీకాకుళానికి షిఫ్ట్ అయినట్టున్నారు. ఏమైనా ఎమ్మే చదువుతున్న వ్యక్తికి ఐదవ తరగతివాడి కన్నా అద్వాన్నంగా చూపించడం, కనీసమైన కల్చర్ తెలీకుండా తోటి విద్యార్థిని ఓలే ఒసే అనడం, ఏది పడితే అది మాట్లాడడం, కామన్సెన్స్ లేకుండా ప్రవర్తించడం వినోదం కాదు, విషాదం!

First Published:  12 Jun 2015 8:26 AM GMT
Next Story