సంపూని బూచిగా మార్చేసిన విష్ణు

పిల్లలు ఎవరైనా సరిగ్గా తిండి తినకపోతే అదిగో బూచి అంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. మారాం చేస్తున్న పిల్లలు వెంటనే ఏడుపు ఆపేసి తినేస్తారు. ఇప్పుడీ ట్యాగ్ లైన్ సంపూర్ణేష్ బాబుకు కూడా వర్తిస్తుంది. పిల్లలెవరైనా తినకపోతే అదిగో సంపూ అంటూ భయపెడుతున్నారు. స్వయంగా ఈ పనిని మంచు విష్ణు చేస్తున్నాడట. ఈ విషయాన్ని హీరోయిన్ ప్రణీత బయటపెట్టింది.

ఓసారి సంపూ పోలీస్ గెటప్ లో డైనమేట్ మూవీ సెట్స్ కి వెళ్లాడు. అక్కడ హీరో విష్ణు, హీరోయిన్ ప్రణీతతో పాటు విష్ణు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంపూను పోలీస్ గెటప్ లో చూసిన వెంటనే పిల్లలిద్దరూ ఏడుపు అందుకున్నారట. పైగా సంపూ పలకరించేసరికి ఆ ఏడుపు డబుల్ అయిందట. అదిగో.. అప్పట్నుంచి పిల్లలకు సంపూను చూపిస్తూ భోజనం పెట్టడం ప్రారంభించాడట విష్ణు.