దర్శకుడితో నయనతార రొమాంటిక్ సెల్ఫీ

ఇటీవల నయనతార కేరళలో సీక్రెట్ మ్యారేజ్ చేసేసుకుందని తెగ అల్లరి అల్లరి అయ్యింది. ఆమె తమిళ్‌లో చేస్తున్న ‘నాన్ రౌడీ తాన్’ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో పెళ్ళి అనేవి ఒట్టి పుకారే అని తేల్చినా…అది సినిమా పబ్లిసిటీ స్టంట్ అని తర్వాత గుసగుసలు మొదలయ్యాయి. అఫ్‌కోర్స్ అన్ని రూమర్స్ లాగే ఇది కూడా సద్దుమనిగి పోయింది.

కానీ, ఇప్పుడొక హాట్ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో చాలా క్లోజ్‌గా రొమాంటిక్‌గా తీసుకున్న ఒక్క సెల్ఫీ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ సెల్ఫీ మళ్ళీ వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పైన అనుమానాలు రేపుతుంది. ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ చూస్తే ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువే అనిపిస్తుంది…ఇద్దరి మధ్య వర్క్ రిలేషన్‌షిప్‌కి పొంతన కుదరట్లేదు. ఈ పిక్ చూస్తే మీకూ అట్లాంటి డవుటే వస్తుంది కదూ?