Telugu Global
Cinema & Entertainment

 అఖిల్ నుంచి మరో వీడియో

తన ఎంట్రీ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేశాడు అఖిల్. అందులో అఖిల్ తో పాటు అంతా కనిపిస్తారు. కానీ ఈసారి తన సోలో పర్ ఫార్మెన్స్ తో మరో వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అఖిల్. ఆ విషయాన్ని స్వయంగా అతడే ప్రకటించాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఈ అప్ కమింగ్ హీరో, ఆ మూవీపైనే కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. ఈమధ్యే యూరోప్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది అఖిల్ సినిమా. త్వరలోనే […]

 అఖిల్ నుంచి మరో వీడియో
X
తన ఎంట్రీ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేశాడు అఖిల్. అందులో అఖిల్ తో పాటు అంతా కనిపిస్తారు. కానీ ఈసారి తన సోలో పర్ ఫార్మెన్స్ తో మరో వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అఖిల్. ఆ విషయాన్ని స్వయంగా అతడే ప్రకటించాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఈ అప్ కమింగ్ హీరో, ఆ మూవీపైనే కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. ఈమధ్యే యూరోప్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది అఖిల్ సినిమా. త్వరలోనే ఫైట్ సీన్స్ తీసేందుకు థాయ్ లాండ్ వెళ్తున్నారు. ఈ విషయాన్ని అఖిల్ ప్రకటించాడు.
“త్వరలోనే థాయ్ లాండ్ వెళ్తున్నా.. వారం రోజుల పాటు బిజి షూటింగ్ చేయబోతున్నా. అయితే థాయ్ లాండ్ వెళ్లడానికంటే ముందే మీ కోసం ఓ చిన్న వీడియోను సిద్ధం చేస్తున్నా.. వెయిట్ చేయండి” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అఖిల్ ప్రాజెక్ట్ పై మరోసారి అందరి దృష్టి పడింది. వినాయక్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను నితిన్, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్, తమన్ సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
First Published:  11 Jun 2015 11:09 PM GMT
Next Story