జ్యోతిలక్ష్మి పుట్టినరోజునే పూరీ జ్యోతిలక్ష్మి విడుదల

ఒకప్పుడు తన ఆటపాటలతో, అంద చందాలతో తెలుగు వారిని అలరించిన వ్యాంప్ కమ్ ఐటెమ్ గర్ల్ జ్యోతిలక్ష్మి. ఎంత పెద్ద హీరో అయినా సరే జయమాలిని లేదా జ్యోతిలక్ష్మి ఐటెం సాంగ్ ఉండాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఐటెం బాంబ్స్‌గా ఈ అక్కాచెల్లెళ్ళు  చాలా కాలం రాజ్యం ఏలారు. ఇప్పుడు పూరీ జ్యోతిలక్ష్మి అనే సినిమా టైటిల్‌తో వచ్చిన సంగతి తెలిసిందే. 

కాకతాళీయంగా, జ్యోతిలక్ష్మి పుట్టినరోజు మరియు, చార్మి నటించిన ‘జ్యోతిలక్ష్మి’ విడుదల తేదీ ఒకే రోజున అంటే జూన్ 12న వచ్చాయి. ఈ విషయం తెల్సుకున్న పూరీ చాలా ఎక్జైటింగ్‌గా ట్వీట్ చేసాడు. తమ సినిమా జ్యోతిలక్ష్మి బయోపిక్ కాకపోయినా,.. ఆమె పుట్టిన రోజు కూడా ‘జ్యోతిలక్ష్మి’ విడుదల రోజున కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేస్తూ… ‘వి ఆల్ లవ్ హర్’ అని ఆమెను గుర్తు చేసుకోవడం బాగుంది.