ర‌విశాస్త్రికి రూ.7 కోట్లు పారితోషికం!

భార‌త క్రికెట్ జ‌ట్టుకు కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న ర‌విశాస్త్రికి బీసీసీఐ ఏకంగా రూ.7 కోట్లు వార్షిక వేత‌నంగా చెల్లించ‌నుంది. మాజీకోచ్ డంకెన్ ఫ్లెచ‌ర్‌కు ఏడాదికి రూ.4.2 కోట్లు చెల్లిస్తేనే ప్ర‌పంచ క్రికెట్ ఆశ్చ‌ర్య‌పోయింది. ఇప్పుడు ఏకంగా రూ.7 కోట్లు అంటే మ‌రోసారి నివ్వెర‌పోక త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం టీమ్ మేనేజ‌ర్‌గా కొన‌సాగుతున్న ర‌విశాస్ర్తి స్థానంలో రాహుల్ ద్రావిడ్ వ‌స్తాడ‌ని అంతా అనుకున్నారు. కోచ్ ప‌ద‌వి చేప‌ట్టేందుకు  ప్ర‌స్తుతానికి సుముఖంగా లేన‌ని రాహుల్‌ ప్ర‌క‌టించ‌డంతో చివ‌రికి బోర్డు ర‌విశాస్ర్తిని ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే బోర్డుకు వ్యాఖ్యాత‌గా ఏడాదికి రూ.4 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు అద‌నంగా కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నుండ‌టంతో ఇవ‌న్నీ క‌లిపి రూ.7 కోట్ల‌కు చేరింది. ఈ దెబ్బ‌తో ప్ర‌పంచంలో అత్యంత అధిక వేత‌నం అందుకుంటున్న కోచ్‌గా ర‌విశాస్ర్తి రికార్డు సృష్టించ‌నున్నారు.