నానికి గాయం, రాజమౌలి హోస్ట్ మార్పు

రాజమౌలి ‘ఈగ’, ‘బాహుబలి’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందని అనౌన్స్ చేయగానే అందరికీ అర్థం అయ్యిపోయింది…అది నాని అని. రాజమౌళి ‘ఈగ’లో టైటిల్ రోల్ ప్లే చేసిన నాని యాంకరింగ్ అనగానే చాలా ఎక్జైటింగ్‌గా అనిపించిన మాట వాస్తవం. అనుకోకుండా ఆడియో లాంచ్ ఈవెంట్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ రోజు తిరుపతిలో ఆడియో లాంచ్ అత్యంత ఘనంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరగనుంది.

కాని విధిరాత విచిత్రంగా, నాని ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేయలేకపోతున్నాడు. కారణం అతడు ‘భలే భలే మగాడివోయ్’ సినిమా యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌లో కాలికి గాయం అవ్వడమే. ఇందుకు చింతిస్తూ రాజమౌళి, నానిని మిస్ అవ్వబోతున్నామని ట్వీట్ చేసి యాంకర్ మార్పుని కూడా అనౌన్స్ చేసారు. ఇప్పుడు నానికి బదులు స్టార్ యాంకర్ సుమ ‘బాహుబలి’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ని హోస్ట్ చేయబోతుందన్నమాట. యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణం ఇది. ఆల్ ద బెస్ట్ టు టీం ‘బాహుబలి’.