Telugu Global
Others

నకిలీ ఐఏఎస్ రాఘవేంద్ర అరెస్ట్‌

నకిలీ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరెడ్డి గుట్టును అల్వాల్ పోలీసులు రట్టు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని… వారి పేర్లు ఉపయోగించుకునే వాడు. ఆ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి… నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి […]

నకిలీ ఐఏఎస్ రాఘవేంద్ర అరెస్ట్‌
X
నకిలీ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరెడ్డి గుట్టును అల్వాల్ పోలీసులు రట్టు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని… వారి పేర్లు ఉపయోగించుకునే వాడు. ఆ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి… నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు రాఘవేంద్రరెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. అతడి బారిన పడిన వారిలో మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే కనకారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. నిందితుడు రాఘవేందర్ రెడ్డి పై వివిధ పోలీసు స్టేషన్లలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
First Published:  13 Jun 2015 5:24 AM GMT
Next Story