ఉస్మానియాలో కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం

అతితక్కువ వనరుల మధ్య ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేయడాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. కడపకు చెందిన షరీఫ్‌కు బ్రెయిన్‌ డెడ్ అయిన మహిళ కాలేయాన్ని ఉస్మానియా వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఇందుకు వైద్యమంత్రి లక్ష్మారెడ్డి చొరవతీసుకోగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఆపరేషన్‌కోసం సీఎం రిలీఫ్‌ఫండ్‌ నుంచి 10 లక్షలు కేటాయించారు. గాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌ డాక్టర్‌ మధుసూదన రావు ఆధ్వర్యంలో 20 మంది వైద్య బృందం ఈ చికిత్సలో పాలుపంచుకుంది.