ప్రియాంక చోప్రా మరో సంచలనం

ఇప్పటికే ఇంటర్నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది ప్రియాంకచోప్రా. ఆమె చేసిన ఇంగ్లిష్ వీడియో ఆల్బమ్స్ కు మంచి పేరొచ్చింది. దీంతో ప్రియాంక ఫోకస్ మొత్తం హాలీవుడ్ పైనే పెట్టింది. ఇప్పటికే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న ప్రియాంక, ఇప్పుడు ఓ ఇంగ్లిష్ సీరియల్ లో కూడా నటించేందుకు అంగీకరించింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. ఆ సీరియల్ ప్రోమోలో కూడా నటించింది. అర్థనగ్నంగా ప్రియాంక చేసిన ఆ వీడియో ఇప్పుడు ఇంట్రనెట్ లో హాట్ హాట్ గా మారింది. క్వాంటికో పేరుతో చేస్తున్న ఆ హాలీవుడ్ సీరియల్ లో ప్రియాంకా చోప్రా ఎఫ్ బీ ఐ ఏజెంట్ గా కనిపించనుంది. ఒంటిపై చిన్న గుడ్డ మాత్రమే ఉంటుంది. దానిపై ఎఫ్ బీ ఐ అని మాత్రమే రాసి ఉంటుంది. అలాంటి కాస్ట్యూమ్ తో కారులో రొమాన్స్ చేసే సీన్ ను ప్రియాంక చోప్రాపై చిత్రీకరించారు. చూస్తుంటే.. హిందీ ప్రాజెక్టుల కంటే ఇంగ్లిష్ సీరియళ్లకే ఆమె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది.