మరో గెటప్పులోకి మారిన షారూక్ ఖాన్

మోకాలి చిప్పకు సర్జరీ జరిగిన కారణంగా దాదాపు నెల రోజులు ఇంటికే పరిమితమయ్యాడు షారూక్. కెమెరా కంటికి చిక్కలేదు. ఈ నెలరోజులు రెస్ట్ తీసుకోవడంతో పాటు తన కొత్త సినిమా కోసం న్యూలుక్ లోకి కూడా మారాడు కింగ్ ఖాన్. ఆ నయా లుక్ తోనే రోహిత్ షెట్టి డైరక్షన్ లో దివాలే సినిమాలో నటించేందుకు బల్గేరియా బయల్దేరాడు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కాడు. దివాలేలో షారూక్ న్యూలుక్ చూసి అభిమానులు పొంగిపోయారు. అక్కడక్కడ ట్రిమ్ చేసిన గడ్డం, డై చేసిన హెయిర్ తో హాలీవుడ్ హీరో రేంజ్ లో అదరగొట్టాడు షారూక్. హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత షారూక్ ట్రైచేస్తున్న నయా  గెటప్ ఇదే.
చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత మరో సినిమా చేస్తానని రోహిత్ కు మాటిచ్చాడు షారూక్. అన్నట్టుగానే దివాలే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి నెల రోజుల కిందటే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, షారూక్ మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో వాయిదాపడింది. దివాలేలో షారూక్ తో పాటు వరుణ్ ధావన్, కృతి సనోన్ నటిస్తారు. రోహిత్ స్టయిల్ లోనే యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది దీవాలే.