Telugu Global
Others

'సాలార్‌ జంగ్'లో 14 నుంచి పత్యేక ప్రదర్శన

మూడో సాలార్‌జంగ్ అయిన నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ బహద్దూర్ 126వ జయంతి ఉత్సవాలను ఈ నెల 14 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు సాలార్‌జంగ్ మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మీర్ తురబ్ అలీ ఖాన్, మీర్ లాయక్ అలీ ఖాన్, మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనే […]

మూడో సాలార్‌జంగ్ అయిన నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ బహద్దూర్ 126వ జయంతి ఉత్సవాలను ఈ నెల 14 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు సాలార్‌జంగ్ మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మీర్ తురబ్ అలీ ఖాన్, మీర్ లాయక్ అలీ ఖాన్, మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనే వారు నిజాముల వద్ద ప్రధాన మంత్రులుగా పనిచేశారు. సాలార్‌జంగ్ అనేది నిజాం ప్రభువులు వారికి ఇచ్చిన బిరుదు. ఐరోపా, మధ్య ఆసియాలోని 36 దేశాల నుంచి వారు సేకరించిన సుమారు 43 వేల వస్తువులను, 50 వేలకు పైగా పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సాలార్‌జంగ్ మ్యూజియంలో పర్యాటకుల సందర్శనార్థం ఉంచారు.

First Published:  12 Jun 2015 1:41 PM GMT
Next Story