Telugu Global
Family

దమయంతి (For Children)

విదర్భగా పిలవబడే కుండిన దేశపురాజు భీష్మకుడు. అతని కూతురే దమయంతి. రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు దమయంతి పెట్టింది పేరని స్వర్గలోకం వరకూ పేరు పాకింది. అందుకని ఆమెను పెళ్ళాడడం కోసం దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు ఉవ్విళ్ళూరారు.             అప్పటికే నలుని దగ్గరనుండి వచ్చిన సుచిముఖి అనే హంస ద్వారా దమయంతి అన్నీవిని మనసు పెంచుకుంది. నలునికీ దమయంతి అంటే ఇష్టమే. ఇంతలో దమయంతి స్వయవరం ప్రకటించాడు తండ్రి భీష్మకుడు. నల చక్రవర్తిని స్వయంవరానికి రమ్మని కోరి […]

విదర్భగా పిలవబడే కుండిన దేశపురాజు భీష్మకుడు. అతని కూతురే దమయంతి. రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు దమయంతి పెట్టింది పేరని స్వర్గలోకం వరకూ పేరు పాకింది. అందుకని ఆమెను పెళ్ళాడడం కోసం దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు ఉవ్విళ్ళూరారు.

అప్పటికే నలుని దగ్గరనుండి వచ్చిన సుచిముఖి అనే హంస ద్వారా దమయంతి అన్నీవిని మనసు పెంచుకుంది. నలునికీ దమయంతి అంటే ఇష్టమే. ఇంతలో దమయంతి స్వయవరం ప్రకటించాడు తండ్రి భీష్మకుడు. నల చక్రవర్తిని స్వయంవరానికి రమ్మని కోరి హంసతో రాయభారం పంపింది దమయంతి.

దమయంతి స్వయవరం. ఆమె కళ్ళు నలుని కోసం వెతుకుతున్నాయి. నలుని చూడగానే ఆమె మనసు ఉప్పొంగింది. ఆనందం యెంతోసేపు నిలవలేదు. ఒక నలుడు కాదు, పక్కన మరో నలుగురు నలులున్నారు. అప్పడు దమయంతికి అంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చింది. తన అంతఃపుర మందిరంలోకి అదృశ్యుడై వచ్చిన నలుడు దేవేంద్ర అగ్ని వాయువరుణ దేవుళ్ళు నిన్ను కోరుకుంటున్నారని చెప్పాడు. అప్పుడే తను వలచిన వానినే వరిస్తానని చెప్పింది. మరిప్పుడు తన ముందున్న అయిదుగురు నలుని రూపధారుల్లో తన నలుడెవరో? సాయం కోరుతూ సరస్వతీ దేవిని ప్రార్థించింది. అలా తను ప్రేమించిన నలున్నే మాలవేసి పెళ్ళాడింది దమయంతి.

నిషధ దేశాన్ని ఏలుతూన్న నలుడు దమయంతితో సంతోషంగా ఉన్నాడు. దమయంతి కూతుర్నీ కొడుకుని కన్నది… ఆ సుఖం సౌఖ్యం ఎన్నాళ్ళో నిలవలేదు. నలుడు దుర్వ్యసనాలలో పడిపోవడం జూదంలో రాజ్యాన్ని కోల్పోవడం చివరకు కట్టుబట్టలతో అడవులపాలు కావడంతో దమయంతి భర్తతో వెంట వెళ్ళింది. పిల్లల్ని తన తండ్రి దగ్గరకు పంపింది. ఎన్నో కష్టాలుపడింది. కష్టాలు చూడలేక కావచ్చు, నలుడు దమయంతిని అడవిలోనే వదిలి వెళ్ళిపోయాడు. నిద్రలేచి నలుడు కనబడక ఆందోళన పడింది. ఏడ్చింది. ఎరుకలవాడు బలాత్కారము చెయ్యబోయి భస్మీపటలం అయ్యాడు. భర్తను వెతుకుతూ అడవిని దాటి నగరం చేరుకుంది. సైరంధ్రి కంట పడింది. పినతల్లి పద్మావతి ఇంట చేరింది. భీష్మకుడు కూతురూ అల్లుడూ ఎక్కడ ఉన్నారోనని వెతికించడంతో – ఈ వార్త తెలిసింది. మొత్తానికి తిరిగి తండ్రి దగ్గరకు చేరింది దమయంతి.

నలున్ని తిరిగి రప్పించడానికి దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు భీష్మకుడు. నలుడు ఆశ్రయం పొందివున్న ఋతువర్ణుడు నలుడే అశ్వకుడిగా ఆ స్వయం వరానికి బయల్దేరి వస్తాడు. ఆ రాత్రి నలుడు వచ్చిన సంగతి తెలిసి దమయంతి దాసీతో పిల్లల్ని పంపుతుంది. పిల్లల్ని చూసి నలుడు కన్నీరవుతాడు. అతని రూపం చూస్తే పోలికలేదు. భార్యని అడవిలో విడిచి వచ్చిన వాడంటూ నలుని నిందిస్తూ తండ్రితో మాట్లాడుతుంది దమయంతి. నలుడు వినేలా. కష్టం చూడలేక వీడి వచ్చానంటాడు నలుడు. నువ్వు రెండో స్వయం వరానికి సిద్ధమవడం సబబేనా అని అంటాడు. దాంతో బాహుకిడిగా వచ్చిన వాడే నలుడని దమయంతికి రూఢీ అవుతుంది. ఆమె తండ్రితో చెప్పడం తండ్రి భీష్మకుడు రుతుపర్ణునితో చెప్పడం, అందరూ నలుని అడగడం… అప్పుడు కలి బయటకు వచ్చి జరిగింది చెప్పాడు. కర్కాటకుని కారణంగానే కురూపి అయ్యాడు. అతణ్ని తలచుకోగానే అసలు రూపం వచ్చింది నలునుకి! రుతుపర్ణుని సహకారంతో దండెత్తి నలుడు తిరిగి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. భర్తా బిడ్డలతో తిరిగి రాజ్యానికి చేరిన దమయంతి కష్టాలను ఈది సుఖపడుతుంది!

నలుని లోకంగా నమ్మి కష్టాల కోర్చి నిలబడగలిగింది కాబట్టే దమయంతి “నల దమయంతి” అయి ప్రసిద్ధికెక్కింది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  12 Jun 2015 1:02 PM GMT
Next Story