అక్కినేని ఫ్యామిలీ డ్రామలోకి సూర్య ఎంట్రీ!

వినడానికి కాస్త డిఫరెంట్‌గా ఉంది కదా సూర్యా ఎంట్రీ ఇన్‌టు అక్కినేని ఫ్యామిలీ డ్రామా! కాని ఇదే నిజం. సూర్యా రాబోయే తమిళ సినిమా పేరు ’24’. ఈ సినిమాని అక్కినేని ఫ్యామిలీ డ్రామా ‘మనం’ డైరెక్ట్ చేసిన విక్రం కుమార్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ’24’ ఒక రీమేక్ సినిమా అని తాజా సమాచారం. అది కూడా ‘మనం’ రీమేక్ అని తెలుస్తోంది.

అక్కినేని ఫ్యామిలీలో మూడు తరాల హీరోస్ ఉండడం కారణంగా ఆ పునర్జన్మ కాన్‌సెప్ట్ సూపర్‌గా వర్క్అవుట్ అయ్యింది. కాని సూర్య విషయంలో ఇది సాధ్యం కాదు కదా! అందుచేత; తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు పాత్రల్లో సూర్య త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. సూర్య డబుల్ రోల్స్ చాలా సినిమాలలో చేసారు. ట్రిపుల్ రోల్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. మరి విక్రం కుమార్ తెలుగులో అక్కినేని ఫ్యామిలీతో క్రియేట్ చేసిన మ్యాజిక్ తమిళ్‌లో ఎంత వరకు రీక్రియేట్ చేయగలడో వేచి చూడవలసిందే. ఏమంటారు?