Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 112

కొత్తగా ఇంట్లో దిగిన పెద్దమనిషి పక్కింట్లో చాలామంది పిల్లలు ఉండడం చూశాడు. వాళ్ళలో ఒక కుర్రాణ్ణి పిలిచి “బాబూ మీరెంతమంది అన్నదమ్ములు” అని అడిగాడు. “మేము తొమ్మిదిమంది అన్నదమ్ములం, నలుగురు అక్కలు” అన్నాడు. ఆ పెద్దమనిషి “అబ్బో! పెద్దకుటుంబమే. మీ నాన్న ఏ పని చేస్తాడు” అని అడిగాడు. ఆ అబ్బాయి “ఇంక ఏం పనిచేయడండి” అన్నాడు. —————————————————————- ఒక ట్రక్‌ డ్రైవర్‌గా ఉన్న సర్దార్జీ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అతని ఇంగ్లీషు చాలా పరిమితం. ట్రక్కు వెనక […]

కొత్తగా ఇంట్లో దిగిన పెద్దమనిషి పక్కింట్లో చాలామంది పిల్లలు ఉండడం చూశాడు. వాళ్ళలో ఒక కుర్రాణ్ణి పిలిచి “బాబూ మీరెంతమంది అన్నదమ్ములు” అని అడిగాడు.
“మేము తొమ్మిదిమంది అన్నదమ్ములం, నలుగురు అక్కలు” అన్నాడు.
ఆ పెద్దమనిషి “అబ్బో! పెద్దకుటుంబమే. మీ నాన్న ఏ పని చేస్తాడు” అని అడిగాడు.
ఆ అబ్బాయి “ఇంక ఏం పనిచేయడండి” అన్నాడు.
—————————————————————-
ఒక ట్రక్‌ డ్రైవర్‌గా ఉన్న సర్దార్జీ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అతని ఇంగ్లీషు చాలా పరిమితం. ట్రక్కు వెనక రాసిన “ఓకే, టాటా, సీయు లేటర్‌, హార్న్‌ ప్లీజ్‌” అన్న పదాలు మాత్రము అతనికి తెలుసు.
అంతకుముదే ఇంగ్లాండులో సెటిలయిన సర్దార్జీ కొత్తగా వచ్చిన సర్దార్జీని భోజనానికి పిలిచాడు.
భోజనాలు పూర్తయ్యాక కొత్తగా వచ్చిన సర్దార్జీ “వస్తానని” చెప్పాడు. పాత సర్దార్జీ “ఓకే. టాటా. సీయు అగెయిన్‌!” అన్నాడు.
కొత్త సర్దార్జీ “హార్న్‌ ప్లీజ్‌!” అన్నాడు.
—————————————————————-
ఒక రైతు లాయర్‌ దగ్గరికి వచ్చాడు. లాయర్‌ ఆ రైతును చూసి “నువ్వు నా దగ్గరికి రావడం వెనక నేను గొప్ప లాయర్నని అందరూ అని ఉంటారు అందుకని వచ్చావనుకుంటాను” అన్నాడు.
రైతు అదేం కాదు. ఇక్కడికి రావడానికి ముందు పదిమంది లాయర్లని కలిశాను. వాళ్ళు “ఎవడో బుర్రలేని లాయర్‌ తప్ప నీ కేసు ఎవరూ తీసుకోడు” అన్నాడు. అందుకని వచ్చానన్నాడు.

First Published:  12 Jun 2015 1:03 PM GMT
Next Story