Telugu Global
NEWS

మృత్యుంజయుడికి ఎమ్మెల్యే దత్తత

రాజమండ్రి వద్ద దవళేశ్వరం ప్రమాదంలో రెండు కుటుంబాలకి చెందిన 22 మంది చనిపోగా ఒకే ఒక్క బాలుడు బతికి బయట పడ్డాడు. విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఈ 23 మంది తిరుపతి వెళ్ళి వస్తూ దారిలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని తమ స్వస్థలానికి చేరుకునే ప్రయత్నంలో ఉండగా ఈ 22 మందిని మృత్యువు కబళించింది. అయితే తుపాను వ్యాను గోదావరి వంతెన నుంచి 30 అడుగుల లోతు ఉన్న నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో […]

మృత్యుంజయుడికి ఎమ్మెల్యే దత్తత
X
రాజమండ్రి వద్ద దవళేశ్వరం ప్రమాదంలో రెండు కుటుంబాలకి చెందిన 22 మంది చనిపోగా ఒకే ఒక్క బాలుడు బతికి బయట పడ్డాడు. విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఈ 23 మంది తిరుపతి వెళ్ళి వస్తూ దారిలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని తమ స్వస్థలానికి చేరుకునే ప్రయత్నంలో ఉండగా ఈ 22 మందిని మృత్యువు కబళించింది. అయితే తుపాను వ్యాను గోదావరి వంతెన నుంచి 30 అడుగుల లోతు ఉన్న నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 21 మంది చనిపోగా ఇద్దరు మాత్రం తెల్లారే వరకు ఇద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది గమనించిన జాలర్లు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా ఈ ఇద్దరిలో ఒక బాలిక ప్రాణాలు దారిలోనే పోయాయి. ఒకే ఒక్క బాలుడు ఈ ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా మిగిలాడు. ఇతన్ని కిరణ్‌గా గుర్తించారు. రెండు కుటుంబాల సభ్యులు ఈ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ అనాథగా మిగిలిపోయాడు. దీనికి వెంటనే స్పందించిన యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా ఉన్న కిరణ్‌ను తాను దత్తత తీసుకుంటానని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
First Published:  13 Jun 2015 3:41 AM GMT
Next Story