వెరైటీగా వివాహ వార్షికోత్సవం

గురువారం నాగార్జున-అమల పెళ్లిరోజు. ప్రతి ఏటా వివాహ వార్షికోత్సవాన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసుకునే ఈ జంట ఈ ఏడాది కూడా అదే పద్దతి ఫాలో అయింది. సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా వెడ్డింగ్ యానివర్సిటీ జరిగింది. పెళ్లి రోజు సందర్భంగా అమలా నటించిన హమారీ అధూరీ కహానీ సినిమాని ఈ జంట కలిసి చూసింది. అలా వివాహ వార్షికోత్సవాన్ని వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది.
 
                కొన్ని దశాబ్దాల విరామం తర్వాత అమల ముఖానికి మేకప్ వేసుకుంది. కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించింది. అదే ఊపులో హిందీలో కూడా హమారీ అధూరీ కహానీ అనే సినిమా చేసింది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఇమ్రాన్ హస్మి, విద్యాబాలన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఇమ్రాన్ హస్మికి అమ్మగా అమల నటించింది. కేవలం వీళ్ల పెళ్లి రోజు కోసమే దర్శక-నిర్మాతలు నాగార్జున ఇంటిలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.