బాహుబలి రిలీజ్ డేట్ పక్కా

బాహుబలి సినిమా విడుదల ఇప్పటికే ఒకసారి వాయిదాపడింది. దీంతో మరోసారి వాయిదా పడకూడదనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు దర్శకుడు రాజమౌళి. అందుకే సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. అనధికారికంగా జులై 10న బాహుబలి విడుదలవుతుందనే విషయం అన్ని మీడియా సంస్థల్లో వచ్చినప్పటికీ ఆ విషయాన్ని జక్కన్న మాత్రం ఎక్కడా ధృవీకరించలేదు. ఫైనల్ గా బాహుబలి ఆడియో వేడుక సందర్భంగా తిరుపతిలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు రాజమౌళి. ఇన్నాళ్లు అనధికారికంగా చలామణి అవుతున్న జులై 10 తేదీనే అధికారికంగా ఫిక్స్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చేనెల పదో తేదీకి 3 రోజుల ముందే ఫస్ట్ ప్రింట్ రెడీ అయిపోతుందని అంటున్నాడు రాజమౌళి. సో.. ఈసారి బాహుబలి సినిమా విడుదలపై డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆడియో కూడా రిలీజ్ అయింది కాబట్టి.. అనుకోని అవాంతరాలు ఎదురైతే తప్ప సినిమా విడుదలకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే.