చీకటి రాజ్యం ఓ రీమేక్?

లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న చీకటి రాజ్యం సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ బయటకొస్తోంది. మొన్నటికి మొన్న పోస్టర్ లో కమల్ ముద్దుపెట్టుకున్నది త్రిషను కాదనే విషయం బయటకొచ్చింది. తర్వాత ఇందులో మధుషాలినీ కూడా హీరోయిన్ గా నటిస్తుందనే విషయం బయటకొచ్చింది. ఆ తర్వాత కమల్ ఇందులో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనే విషయం బయటకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓ రీమేక్ అనే విషయం తెలిసొచ్చింది. 
             2011లో వచ్చిన ఓ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా చీకటి రాజ్యం సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఓ పోలీస్ ఆఫీసర్.. ఒక రాత్రిలో తన కొడుకుతో పాటు ఉద్యోగాన్ని ఎలా కాపాడుకున్నాడనే కథాంశంతో ఆ ఫ్రెంచ్ సినిమా తెరకెక్కింది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో చీకటి రాజ్యం వస్తోందని సమాచారం. టైటిల్ కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. దీనికి తగ్గట్టు సినిమాను కూడా రాత్రి షెడ్యూల్స్ లోనే తీస్తున్నారు. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డులో కొన్ని సన్నివేశాలు తీశారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చెన్నై లో మరో షెడ్యూల్ ప్రారంభమౌతుంది.