పవన్-దాసరి సినిమా రెడీ..!

దాసరి నారాయణరావు బ్యానర్ లో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. గోపాల గోపాల సినిమాతో పవన్ ను ఆకట్టుకున్న డాలీ ఈ సినిమాకు డైరక్షన్ చేయబోతున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే. తాజా న్యూస్ ఏంటంటే.. ఇప్పుడీ మూవీకి కథ సిద్ధమైంది. అవును.. దాసరి ఆలోచనలకు అనుగుణంగా పవన్ కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ రెడీ చేశాడు డాలీ. ఆ స్టోరీలైన్ ను పవన్ కు కూడా వినిపించాడట. స్టోరీలైన్ నచ్చిన పవన్ వెంటనే దాని పూర్తి స్క్రీన్ ప్లే సిద్ధం చేయమని అడిగాడట. దీంతో దాసరి కూడా అదే కథకు ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం గబ్బర్ సింగ్-2 సినిమా బిజీలో ఉన్నాడు పవన్. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే దాసరి బ్యానర్ పై డాలీ డైరక్షన్ లో సినిమా మొదలవుతుంది. ఈ గ్యాప్ లో డాలీ కథకు, స్క్రీన్ ప్లేకు ఎన్ని మార్పులు జరుగుతాయో చూడాలి. ఎందుకంటే.. ఈ మధ్య స్క్రీన్ ప్లే విషయంలో పవన్ చాలా సీరియస్ గా ఉంటున్నాడు. గబ్బర్ సింగ్-2 ప్రాజెక్ట్ ఆలస్యమవ్వడానికి, దర్శకుడు మారిపోవడానికి కారణం కూడా ఇదే అనే విషయం అందరికీ గుర్తే.