మాజీ మంత్రి వసంత పోస్టుకార్డుల ఉద్యమం

సెక్షన్- 8ను అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి వసంతనాగేశ్వరరావు పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ర్ట పతికి పోస్టుకార్డులు పంపించారు. నందిగామ మండలం ఐతవరం నుంచి ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్‌ భాష తీరు వెంటనే మార్చుకోవాలన్నారు. సీఎం ఫోన్‌నే ట్యాప్‌ చేయడం అనైతికమని, చట్ట విరుద్ధమని అన్నారు.