స‌గం క‌థ సిద్దం

చిరంజీవి 150 వ సినిమాకు  ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాధ్  స‌గం క‌థ‌ను అప్పుడే సిద్దం చేశార‌ట‌.ఈ మ‌ధ్య క‌థ‌ను చిరుకు వినిపించార‌ట‌.  క‌థ విని చిరంజీవి థ్రిల్ అయ్యార‌ట‌.   ఇక సెకండాఫ్ దీనికంటే ప‌ది రెట్లు..సిద్దం చేయడానికి క‌ష్ట‌ప‌డ‌నున్న‌ట్లు  ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్  ట్విట్ చేశారు.ఈ మ‌ధ్య పూరి , చిరంజీవి చిత్రం ఆగిపోయింద‌నే పుకార్లుకు దీంతో  తెర‌ప‌డ‌నట్లుయ్యింది, పూరి ప్లేస్ ను మ‌రో డైరెక్ట‌ర్ భ‌ర్తీ చేస్తాడ‌ని  కూడ  గుస‌గుస‌లు వినిపించాయి. అయితే అటువంటింది  ఏమిలేద‌నేది క్లియ‌ర్ అయ్యింది.
చిరంజీవి 150 సినిమాకు  ఆటో జానీ అని అనుకుంటున్న విష‌యం తెలిసిందే. సినిమాను  ఆగ‌ష్టు 22 న అంటే మెగాస్టార్ పుట్టిన రోజు  న షూటింగ్ లాంచ‌నంగా ప్రారంభించ‌డానికి రంగం సిద్దం చేస్తున్నార‌ని వినికిడి. అయితే ఆరు ప‌దుల వయ‌సులో చిరు   .. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ ను ఏ మేర‌కు  ఇంప్రెస్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.