రేవంత్ బ్రీఫ్డ్ బాబు… కేసీఆర్ బ్రీఫ్డ్ మోడి…

అవ‌ర్ పీపుల్ బ్రీఫ్డ్ మి… చంద్ర‌బాబు ఆడియో టేపుల్లో వినిపించిన మాట‌లివి… రేవంత్ త‌న‌కు అన్నీ చెప్పాడ‌ని స్టీఫెన్ స‌న్‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ ఈ మాట‌ల‌ను అన్న‌ట్లుగా ఆ టేపుల్లో వినిపిస్తోంది. ఓటుకు కోట్లు వ్య‌వ‌హారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌ను ఎలా ప్ర‌లోభ‌పెట్టిందీ.. చంద్ర‌బాబు నాయుడు కూడా స్ట‌ఫెన్ స‌న్‌తో మాట్లాడుతూ ఎలాంటి హామీలిచ్చిందీ… అన్నిటికి సంబంధించిన గ‌ట్టి సాక్ష్యాధారాలు తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్నాయి. ఈ విష‌యాల‌న్నిటినీ తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడికి కూలంకషంగా వివ‌రించార‌ట‌. ఆయ‌న‌కే కాదు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా కేసీఆర్ పూస‌గుచ్చిన‌ట్లు వివ‌రించార‌ట‌. చంద్ర‌బాబు నాయుడు హ‌డావిడిగా హ‌స్తిన ప‌య‌న‌మై పోతున్న స‌మ‌యంలోనే కేసీఆర్ ఈ విష‌యాల గురించి ప్ర‌ధానితోనూ, హోం మంత్రితోనూ మాట్లాడేశార‌ట‌.  ప్ర‌స్తుతం బంతి ఫోరెన్సిక్ నిపుణుల కోర్టులో ఉంది. వారు ఇచ్చే నివేదిక‌పైనే చంద్ర‌బాబు నాయుడు భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.