పెద‌రాయుడు ఒక భార‌తం..!

ఒక సినిమా విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించినా.. 20 ఏళ్ల పాటు అభిమానుల హృద‌యాల్లో ఉండ‌ట‌మంటే  గొప్ప విష‌య‌మే. పెద‌రాయుడు సినిమాకు  కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు ఉండ‌టం వ‌ల‌నే అభిమానులు  ఈ సినిమాను 20 ఏళ్లుగా గుర్తు పెట్టుకున్నారు.  మోహాన్ బాబు, సౌంద‌ర్య‌, ర‌జ‌నీకాంత్, భానుప్రియ లీడ్ రోల్స్ లో  ర‌విరాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం  నేటికి 20  సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. 
ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు  ఈ చిత్రం గురించి ప‌లు విశేషాలు మీడియాతో పంచుకున్నారు.  ఈ సినిమాను  చేయ‌మ‌ని అప్ప‌ట్లో  ర‌జ‌నీకాంతే త‌న‌కు స‌ల‌హా ఇచ్చార‌ట‌. త‌మిళ్ లో  న‌ట్ట‌మై అనే సినిమాను తెలుగులో  పెద‌రాయుడుగా రీమేక్ చేశారు. భార‌త , భాగ‌వ‌త‌, రామాయ‌ణాల్లో త‌ల్లి దుండ్రుల్ని ఎలా గౌర‌వించాలి. స్నేహితులు ఎలా ఉండాలి. మ‌న క‌ట్టు బాట్లేంటి ? ఇవ‌న్నీ చెప్పారు.  పెద‌రాయుడు చిత్రంలో ఇవ‌న్ని వున్నాయి.అందుకే ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింద‌ని తెలిపారు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ వాళ్లు.. త‌మ పిల్ల‌ల‌కు  ఈ సినిమాను  క్యాసెట్ రూపంలో   పెట్టుకుని చూపించాల‌ని  స‌ల‌హా ఇచ్చారు.ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ర‌జ‌నీకాంత్   ఒక కీ రోల్ చేశారు.  అందుకు  నిర్మాత మోహాన్ బాబు ద‌గ్గ‌ర ఒక్క పైసా కూడ తీసుకోలేద‌ట‌. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహాం అంతిటి చిక్క‌నైంద‌ని తెలిపారు.