ఇండియాకు తిరిగొచ్చిన కంచె

నాగబాబు తనయుడు వరుణ్ తేజ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కంచె అనే టైటిల్ కూడా పేరుపెట్టారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే వినూత్నమైన కథాంశంతో కంచె తెరకెక్కుతోంది. ఇందులో భారత సైనికుడిగా వరుణ్ తేజ కనిపించనున్నాడు. ఇప్పటికే అతడికి సంబంధించిన ఓ స్టిల్ నెట్ లో తెగ హంగామా చేసింది. ఇప్పటివరకు జార్జియాలో షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చింది. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అంశాలు బయటకురాకుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకే మ్యాగ్జిమమ్ షూటింగ్ విదేశాల్లోనే చేశారు. ఇక హైదరాబాద్ లో కూడా రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్స్ వేసి అందులో షూట్ చేయాలని భావిస్తున్నారు. ముకుందాతో ఆకట్టుకోలేకపోయిన వరుణ్ తేజ, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో కంచె సినిమా చేస్తున్నాడు.