Telugu Global
NEWS

మ‌రికొంత‌మందిని ప్ర‌శ్నించే దిశ‌లో ఏసీబీ

ఓటుకు నోటు కేసు అత్యంత‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ స‌ర్కారు ఎక్కడా తడబాటు లేకుండా, కోర్టులో న్యాయపరమైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని అవినీతి నిరోధ‌క శాఖ‌ను ఆదేశించింది. దీంతో కేసు బలంగా నిలబడేలా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, కాల్‌ డేటాతో సేకరించిన సమాచారం ఆధారంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌ ఫోన్‌ […]

మ‌రికొంత‌మందిని ప్ర‌శ్నించే దిశ‌లో ఏసీబీ
X
ఓటుకు నోటు కేసు అత్యంత‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ స‌ర్కారు ఎక్కడా తడబాటు లేకుండా, కోర్టులో న్యాయపరమైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని అవినీతి నిరోధ‌క శాఖ‌ను ఆదేశించింది. దీంతో కేసు బలంగా నిలబడేలా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, కాల్‌ డేటాతో సేకరించిన సమాచారం ఆధారంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌ ఫోన్‌ నుంచి ఎక్కువసార్లు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కాల్స్‌ వెళ్లినట్లు ఏసీబీ వర్గాలు గుర్తించాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం వల్ల అంతిమంగా లబ్ధి చేకూరేది టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి కావడంతో… ఈ విషయం మొత్తం ఆయనకు తెలిసే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకే, వీరిద్దరినీ ప్రశ్నించ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ప్రాథమిక ఆధారాలకు తగిన బలం ఏర్పడ్డాక మరికొంత మందికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏసీబీ నోటీసులు అందుకునే వారిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనకు సన్నిహితంగా ఉండే కేంద్ర, ఏపీ రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. రేవంత్‌ కాల్‌ డేటాలో వందల సంఖ్యలో ఇన్‌కమింగ్‌, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ ఉన్నప్పటికీ… సహ నిందితులతోపాటు ఇతర రాజకీయ ప్రముఖులతో ఆయన ఎక్కువసార్లు సంభాషణలు సాగించినట్లు గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు, కొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నారని సమాచారం. రేవంత్‌రెడ్డి, సహ నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సమయంలో రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఐ ఫోన్లు, సోదాల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డి్‌స్కను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎ్‌సఎల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ టేపుల్ని మూడు దశల్లో పరీక్షించాల్సి ఉన్నందున నిపుణులు నిజాలు నిగ్గుతేల్చే పని మొదలు పెట్టారు.
First Published:  15 Jun 2015 9:43 PM GMT
Next Story