శ‌ర వేగంగా  అఖిల్ సినిమా షూటింగ్…! 

హీరోగా ప‌రిచ‌యం కావ‌డం పెద్ద విశేషం కాదు. అయితే అల్రేడి తాతా, తండ్రి, అన్న హీరోలుగా నిర్మించిన న‌ట సామ్రాజ్యంలో వార‌సుడిగా వ‌స్తున్నాడంటే..  క‌చ్చితంగా అంచ‌నాలుంటాయి.  ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్ పై అటువంటి అంచ‌నాలే వున్నాయి.  డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ డైరెక్ష‌న్లో నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.  ఈసినిమాలో అఖిల్ ను డిఫ‌రెండ్ షేడ్స్ వున్న న‌టుడిగా చూపిస్తున్నార‌ని వినికిడి. 
సైన్స్ ఫిక్ష‌న్ తో  వ‌స్తున్న ఈ చిత్రం క‌చ్చితంగా అభిమానుల్ని అల‌రిస్తుంద‌ని  చిత్ర యూనిట్ న‌మ్ముతున్నారు. అయితే త‌న మొద‌టి సినిమాకు ఇటువంటి మంచి టీమ్ దొర‌క‌డం త‌న అదృష్టం అంటున్నాడు హీరో అఖిల్. ఈ మ‌ధ్య‌నే విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుని ఇండియా వ‌చ్చింది చిత్ర యూనిట్.  ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక్క‌డ పూర్తి అయిన త‌రువాత థాయ్ లాండ్ కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోను ( ప్ర‌చారం  కోసం..) విడుద‌ల చేయ‌డానికి  స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు   హీరో అఖిల్ ట్విట్ చేశారు.  ద‌స‌రా పండుగ‌కు ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టాక్.