Telugu Global
NEWS

సెక్షన్-8 చెల్లకపోతే విభజన చట్టం చెల్లుతుందా?: ఉమ

రాష్ట్ర విభజన చట్టం చెల్లినప్పుడు..సెక్షన్-8 ఎందుకు చెల్లదని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సెక్షన్-8 గురించి కేసీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ బాద్యత గవర్నర్‌దే అని, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని సెక్షన్-8లో పేర్కొన్నారని గుర్తు చేశారు. సెక్షన్-8 కంటితుడుపు చర్యే అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోవడం లేదని […]

సెక్షన్-8 చెల్లకపోతే విభజన చట్టం చెల్లుతుందా?: ఉమ
X
రాష్ట్ర విభజన చట్టం చెల్లినప్పుడు..సెక్షన్-8 ఎందుకు చెల్లదని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సెక్షన్-8 గురించి కేసీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ బాద్యత గవర్నర్‌దే అని, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని సెక్షన్-8లో పేర్కొన్నారని గుర్తు చేశారు. సెక్షన్-8 కంటితుడుపు చర్యే అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్‌ తాకట్టు పెట్టారని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు.
First Published:  16 Jun 2015 4:01 AM GMT
Next Story