సక్సెస్ ఫుల్ కెరీర్ తో సాగుతున్న నరేష్…

తెలుగు సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందరో ఉన్నారు.రావుగోపాలరావు, ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇలా చాలా మంది నటులు తమ పాత్రలకు నటనతో ప్రాణం పోశారు. ఈ తరం నటుల్లో తన పెర్ ఫార్మెన్స్ తో ఎన్నో క్యారెక్టర్స్ కు ప్రాణం పోస్తున్న నటుడు సీనియర్ నరేష్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న నరేష్ ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆడుమగాడ్రా బుజ్జి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల ఆయన నటించిన చందమామకథలు సినిమాలో అద్భుతమైన నటనను కనపరిచారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయే టాలీవుడ్ నటుడిగా ఈ తరం దర్శకులు, నిర్మాతలకు సమాధానంగా కనపడుతున్నారు. బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నరేష్ ప్రస్తుతం గుంటూర్ టాకీస్ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. చందమామ కథలు వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ పోషిస్తున్న పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ తెలియజేస్తుంది. భలే భలే మగాడివోయ్ చిత్రం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలో, స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో హరికథ(వర్కింగ్ టైటిల్), శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న శివం స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రాల్లో, ఆది హీరోగా మదన్ దర్శకత్వంలో వస్తోన్న గరమ్ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఆయాన్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై చునియా దర్శకత్వంలో రానున్న సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం వినవయ్యా రామయ్యా, అప్పుడలా ఇప్పుడిలా చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇలా నరేష్ వరుస చిత్రాలతో తన సెకండ్ ఇన్సింగ్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు.