Telugu Global
Cinema & Entertainment

అమ్మో రాజ‌మౌళి..!

రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్ వుంటే  హీరోల ప‌ని చాల సులువు అవుతుంది అంటారు ఆయ‌న‌తో ప‌నిచేసిన న‌టీ న‌టులంద‌రు. ఎందుకంటే.. సినిమాలో ప్ర‌తి స‌న్నివేశం ఆయ‌న ముందుగా న‌టించి చూపిస్తారు.  అది ఎటువంటి ఎక్స్ ప్రెష‌న్ అయినా… గుర్రాల‌తో విరోచితంగా పోరాడే స‌న్నివేశ‌మైనా.. మంచి రొమాంటిక్ సీన్ అయినా..ఏదైనా  ప్ర‌తిది రాజ‌మౌళి ముందు న‌టించి చూపించాల్సిందే. ఆ త‌రువాత  న‌టులు ఆయ‌న కోరుకున్న విధంగా అవుట్ పుట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.  తాజాగా ద‌ర్శ‌క జ‌క్క‌న్న రాజ‌మౌళి ప్ర‌భాస్ తో […]

అమ్మో రాజ‌మౌళి..!
X
రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్ వుంటే హీరోల ప‌ని చాల సులువు అవుతుంది అంటారు ఆయ‌న‌తో ప‌నిచేసిన న‌టీ న‌టులంద‌రు. ఎందుకంటే.. సినిమాలో ప్ర‌తి స‌న్నివేశం ఆయ‌న ముందుగా న‌టించి చూపిస్తారు. అది ఎటువంటి ఎక్స్ ప్రెష‌న్ అయినా… గుర్రాల‌తో విరోచితంగా పోరాడే స‌న్నివేశ‌మైనా.. మంచి రొమాంటిక్ సీన్ అయినా..ఏదైనా ప్ర‌తిది రాజ‌మౌళి ముందు న‌టించి చూపించాల్సిందే. ఆ త‌రువాత న‌టులు ఆయ‌న కోరుకున్న విధంగా అవుట్ పుట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. తాజాగా ద‌ర్శ‌క జ‌క్క‌న్న రాజ‌మౌళి ప్ర‌భాస్ తో చెక్కిన బాహుబ‌లి చిత్రం లో మేకింగ్ ఫోటోలు కొన్ని మీడియాకు వ‌దిలారు. ఆ స‌న్నివేశాలు చూస్తుంటే.. బాహుబ‌లి సినిమాలో ర‌ణ‌రంగం సీన్స్ అద‌ర‌హో అనిపించేలా చేయించిన‌ట్లు అనిపిస్తుంది.
తెలుగు ప్రేక్ష‌క లోకం ఎంత‌గానో వెయిట్ చేస్తున్న ఈ చిత్రం వ‌చ్చెనెల 10న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హింది, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల అవుతుంది.ఆడియో కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక ప్ర‌చార చిత్రాల‌కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఒక రేంజ్ ఫాలోయింగ్ వ‌చ్చింది.మొత్తం మీద సినిమా విడుద‌లైన త‌రువాత వాహ్ వా ..రాజ‌మౌళి అనాల్సిందే మ‌నమంతా…!
First Published:  16 Jun 2015 1:39 AM GMT
Next Story