రాణిరుద్ర‌మ్మ‌కు ప్ర‌చారం ఏది..!

తెలుగు సినిమా మార్కెట్ ను మించి  బ‌డ్జెట్ పెట్టి సినిమా నిర్మించిన‌ప్పుడు .. విడుద‌ల‌కు  సిద్దం అవుతున్న స‌మ‌యంలో  ప్ర‌చారం లేక పోతే  ప్రొడ్యూస‌ర్  కు  దెబ్బ త‌గ‌ల‌దా..? క‌చ్చితంగా త‌గులుద్ది అంటున్నారు ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్.  ఈ రోజుల్లో  ప్ర‌చారం కొద్ది సినిమా ఓపెనింగ్స్ అనే  ప‌రిస్థితి ఇండ‌స్ట్రీలో  ఎగ్జిస్ట్ అవుతుంది. మ‌రి ఇటువంటి త‌రుణంలో దాదాపు 70 కోట్లు ఖ‌ర్చు చేసి  అనుష్క లీడ్ రోల్ లో  ద‌ర్శ‌క నిర్మాత గుణ‌శేఖ‌ర్ చేసిన రాణిరుద్ర‌మ చిత్రం విడుద‌ల తేది ద‌గ్గ‌ర ప‌డుతుంది. ఈ నెల 25 న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే  ఇప్ప‌టి వ‌ర‌కు  ఈ సినిమాకు సంబంధించి  ప్ర‌చార హ‌డావుడి ఏమి ప్రారంభం కాలేదు.  కాక‌తీయులు వీర‌నారి  రాణిరుద్ర‌మ జీవితం ఆధారంగా చేసిన ఈచిత్రం  హీరోయిన్  ఓరియెంటెడ్ చిత్రం.  ప్ర‌చారం  ఎంత వుంటే.. ఓపెనింగ్స్  అంత బాగా వ‌స్తాయి.  అస‌లే సినిమా నిడివి చాల ఎక్కువుంద‌నే  టాక్ అల్రేడి బ‌య‌ట‌కు వచ్చింది.   ప‌ట్టుమ‌ని ఇంకా ప‌దిరోజులు కూడా  విడుద‌ల‌కు స‌మ‌యం లేదు. మ‌రి గుణ‌శేఖ‌ర్  సైలెన్స్ చూస్తుంటే..నిజంగా ఈ నెల 25న  రాణిరుద్ర‌మ రిలీజ్ అవుతుందా? లేదా  పోస్ట్ పోన్ చేసుకుంటార అనే సందేహాలు క‌లుగుతున్నాయి మ‌రి.