శృతిహాస‌న్ డ్రీమ్ అదేన‌ట‌..!

గ్లామ‌ర్  హీరోయిన్స్ లో  ప్ర‌స్తుతం  సౌత్  ఇండియ‌న్ టాప్ హీరోయిన్ అంటే  శృతి హాస‌న్ అనే చెప్పాలి.ప‌వ‌న్ క‌ళ్యాణ్  గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో  దుమ్ము లేపిన ఈ హాట్ బ్యూటీ    కెరీర్ ప‌రంగా  ఫుల్ బిజీగా ఉంది.  మ‌హేష్ బాబు శ్రీ‌మంతుడు చిత్రంతో  ముందుకు వ‌స్తున్న శృతిహాస‌న్..క‌థా బ‌లం వున్న హీరోయిన్ రోల్స్ చేయ‌గ‌ల స‌త్తా త‌నుకుంద‌ని  క్లారీటి ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ త‌ర‌హా రోల్స్ చేయ‌క పోయిన‌… ముందు ముందు   ఆ త‌ర‌హా చిత్రాలు చేయ‌డానికి త‌ను స‌ముఖుంగా ఉన్న‌ట్లు తెలిపింది.  ప్రాథ‌మికంగా న‌టించ‌డ‌మే త‌న వృత్తి కాబ‌ట్టి…  ఏ త‌ర‌హా రోల్స్ అయిన చేయ‌డానికి త‌ను సిద్ద‌మే అంటోంది.  మ‌ల్టీ స్టార‌ర్ చిత్ర‌మైన‌.. త‌న‌కు ఏమి అభ్యంత‌రం లేద‌ని .. ఆల్ రౌండ‌ర్ అనిపించుకోవాల‌న‌దే త‌న  ఫైన‌ల్ గోల్ అని తేల్చింది. సో మొత్తం మీద ఈ హాట్ బ్యూటీ..త‌న  తండ్రి క‌మ‌ల్ బాట‌లోనే న‌డుస్తుందన్న‌మాట‌.!