Telugu Global
Others

కేంద్రానికి మోదీ.. ఏపీకి మ‌త్త‌య్య‌!

కేసుల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న వ్య‌క్తికి సాయం చేస్తే ఏమ‌వుతుంది..? విష‌యం బ‌య‌టికి పొక్కితే కుర్చీలు క‌దులుతాయి. ఇప్పుడు దేశంలో అదే జ‌రుగుతోంది. ల‌లిత్‌మోదీకి సాయం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర మంత్రి సుష్మా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన‌ ప‌రిస్థితి వ‌చ్చింది. తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు, ప‌రారీలో ఉన్న మ‌త్త‌య్య‌కు ఏపీ పోలీసులు, ప్ర‌భుత్వం మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ‘ల‌లిత్ మోదీ, మ‌త్త‌య్య’ ఇద్ద‌రూ భార‌తీయులే! ఇద్ద‌రూ చ‌ట్టం ముందు స‌మాన‌మే..! మోదీకి […]

కేంద్రానికి మోదీ.. ఏపీకి మ‌త్త‌య్య‌!
X

కేసుల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న వ్య‌క్తికి సాయం చేస్తే ఏమ‌వుతుంది..? విష‌యం బ‌య‌టికి పొక్కితే కుర్చీలు క‌దులుతాయి. ఇప్పుడు దేశంలో అదే జ‌రుగుతోంది. ల‌లిత్‌మోదీకి సాయం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర మంత్రి సుష్మా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన‌ ప‌రిస్థితి వ‌చ్చింది. తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు, ప‌రారీలో ఉన్న మ‌త్త‌య్య‌కు ఏపీ పోలీసులు, ప్ర‌భుత్వం మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ‘ల‌లిత్ మోదీ, మ‌త్త‌య్య’ ఇద్ద‌రూ భార‌తీయులే! ఇద్ద‌రూ చ‌ట్టం ముందు స‌మాన‌మే..! మోదీకి సాయం చేసిన కేంద్రం విమ‌ర్శ‌ల పాలైంది.. ఇదంతా చాటుమాటు వ్య‌వ‌హారం.. బ‌య‌ట‌ప‌డింది కాబ‌ట్టి వివాద‌మైది. కానీ, మ‌త్త‌య్య‌ది బ‌హిరంగంగా జ‌రుగుతున్న వ్య‌వ‌హారం. ఈ కేసులో’ ఏపీ పోలీసులు, ప్ర‌భుత్వం చ‌ట్టాల‌కు, దేశ స‌మ‌గ్ర‌త‌కు, రాజ్యాంగానికి విరుద్ధంగా’ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం.
అస‌లేం జ‌రిగింది..
ఐపీఎల్ మాజీ ఛైర్మ‌న్, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ల‌లిత్‌మోదీకి వీసా జారీ విష‌యం ఇప్పుడు కేంద్రం మెడ‌కు చుట్టుకుంది. ఈ విష‌యంలో ల‌లిత్‌మోదీకి సాయ‌ప‌డ్డార‌ని సుష్మాస్వ‌రాజ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌తో ఆమె రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఆయ‌న‌పై దేశంలో అవినీతి , మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో ఉన్న మోదీకి గ‌తంలో పోర్చుగ‌ల్‌కు వెళ్లేందుకు సుష్మాస్వ‌రాజ్ సాయ‌ప‌డ్డార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ విష‌యంలో ఒక‌ర‌కంగా కేంద్ర స‌ర్కారు నాలుగురోజులుగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ప్ర‌ధాని, హోంమంత్రి, ఆర్ ఎస్ ఎస్ మ‌ద్దుతుగా నిలిచినా కాంగ్రెస్ ఈ విష‌యాన్ని వ‌దిలేలా లేదు.
ఏపీ స‌ర్కారు ఏం త‌క్కువ కాదు..!
అయితే, ఏపీ ప్ర‌భుత్వం మాత్రం నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప‌క్క‌రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు జ‌రిగిన కుట్ర‌గా అభివ‌ర్ణిస్తున్న కేసులో నిందితుడు ఏపీలో ప్ర‌త్య‌క్ష‌మైతే.. ఏంచేయాలి? నిబంధ‌న‌ల ప్ర‌కారం.. అత‌డిని తెలంగాణ పోలీసుల‌కు అప్ప‌గించాలి. కానీ అలా జరగలేదు. మ‌త్త‌య్య ఫిర్యాదు ఇవ్వ‌గానే తెలంగాణ సీఎంపై కేసు న‌మోదు చేశారు. వెంటనే ఆ కేసును సీఐడీకి అప్ప‌గించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. ఈ విష‌యంలో ఏపీ పోలీసుల‌కు న్యాయ‌స్థానంలో ప‌రాభవం, భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని న్యాయ‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

First Published:  16 Jun 2015 9:21 PM GMT
Next Story