పాత్ర‌ధారుల‌పై ‘లుక్అవుట్’ నోటీసులు ?

నోటుకు నోటు ఎర‌కేసులో సూత్ర‌ధారులుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారి అరెస్టుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అయితే, ఈ జాబితా రోజురోజుకు పెరిగిపోతుండ‌టంతో టీడీపీలో ఇంకెవ‌రి పేర్లు బ‌య‌టికి వ‌స్తాయో ? అని ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుతోపాటు, మ‌రో ఇద్ద‌రు ఎంపీలు సీఎం ర‌మేశ్‌, గ‌రిక‌పాటి రామ్మోహ‌న్‌రావు, కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రికి నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. అలాగే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు న‌గ‌రం, దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల‌కు వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ‘న‌మ‌స్తే తెలంగాణ’ క‌థ‌నం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉండి అవినీతి కేసులో నిందితులుగా ఉండ‌టం, దీనికితోడు ఇప్పుడు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ అవ‌డం చూస్తుంటే వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డింద‌ని వారంతా ఆందోళ‌న చెందుతున్నారు.