తాప్సీ కూడా బిజినెస్ ఉమెనే…

వెలుగు వుండ‌గానే ఇల్లు చ‌క్క దిద్దుకోవాలి. అలాగే లైమ్ లైట్‌లో వున్న‌ప్పుడు కెరీర్ కు సంబంధించి ఆల్ట‌ర్ నేటివ్ చూసుకోవాలి. ఈ విష‌యంలో తాప్సీని చాల‌మంది హీరోయిన్స్ ఫాలో కావోచ్చు అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇంత‌కి తాప్సీ అంత ముందు చూపు తో చేసింది ఎంటాబ్బా అనుకుంటున్నారా..?  హీరోయిన్ గా ఎంత కాలం స‌క్సెస్ ఫుల్ గా ఉంటారో చెప్ప‌డం క‌ష్ట‌మే. ఇదివరకే  తెలుగులో అఫ‌ర్స్ అంతంత మాత్రంగానే వున్నాయి. బాలీవుడ్ నే న‌మ్ముకుంది. అక్క‌డ కూడా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఆఫ‌ర్స్ లేవు. 
అందుకే కీడెంచి మేలు ఎంచ‌మ‌న్న చందంగా… తాప్సీ ..త‌న సోద‌రితో క‌ల‌సి వెడ్డింగ్ ఫ్యాక్ట‌రీ అనే  ఒక సైడ్ బిజినెస్ ప్రారంభించింది.  అయితే తాప్సీ కి కెరీర్ ప‌రంగా పెద్ద‌గా అవ‌కాశ‌లు లేకనే ఇలా సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ ప్రారంభించింది అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  దీనికి తాప్సీ స‌మాధానం మాత్రం డిఫ‌రెంట్ గాఉంది.  హీరోయిన్ గా ఎవ‌రు ఎక్కువ కాలం కంటిన్యూ కాలేరు. అందుకే కాస్తా గుర్తింపు వుండ‌గానే ఇటువంటి బిజినెస్ చూసుకుంటే ఆ త‌రువాత   ఆ భ‌ద్ర‌త భావం అనేది ఉండ‌దని క్లారీటి ఇచ్చింది. నిజ‌మే క‌దా.! అయిన సెల్ఫ్ రెస్పెక్ట్  పోకుండా ఏది చేసిన గొప్ప  విష‌య‌మే క‌దా.!