Telugu Global
NEWS

సీమ‌కు నీరివ్వ‌డం ద్వారా ప‌ట్టిసీమ స‌త్తా చాట‌దాం: బాబు

త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌ట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణ‌యించిన‌ట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేసిన వారికి పట్టిసీమ ప్రాజెక్టు నీటిని రాయ‌ల‌సీమ‌కు ఇవ్వ‌డం ద్వారా సమాధానం చెబుతామని ఆయ‌న‌ అన్నారు.  పట్టిసీమను అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ  పోలవరం పనులను వేగవంతం చేస్తామన్నారు. కుడి కాలువకు అవసరమైన భూములను సేకరిస్తామని, రైతులకు మంచి పరిహారం […]

సీమ‌కు నీరివ్వ‌డం ద్వారా ప‌ట్టిసీమ స‌త్తా చాట‌దాం: బాబు
X
త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌ట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణ‌యించిన‌ట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేసిన వారికి పట్టిసీమ ప్రాజెక్టు నీటిని రాయ‌ల‌సీమ‌కు ఇవ్వ‌డం ద్వారా సమాధానం చెబుతామని ఆయ‌న‌ అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం పనులను వేగవంతం చేస్తామన్నారు. కుడి కాలువకు అవసరమైన భూములను సేకరిస్తామని, రైతులకు మంచి పరిహారం అందజేస్తామని సీఎం అన్నారు. పాలమూరు ఎత్తిపోతలపై మాట్లాడేందుకు బాబు నిరాకరించారు. పట్టిసీమ వలన ముంపు సమస్య తప్పుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తామ‌ని బాబు తెలిపారు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాజ‌మండ్రిలో గోదావ‌రి పుష్క‌రాల‌కు సంబంధించిన ప‌నుల‌ను ప‌రిశీలించి, వాటి ప్ర‌గ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 కౌంట్‌డౌన్‌గా పెట్టుకుని నెల రోజుల్లో పుష్క‌ర పనులన్నీ పూర్తి చేయాల‌ని ఆయ‌న ల‌క్ష్యంగా నిర్దేశించారు.
First Published:  18 Jun 2015 6:32 AM GMT
Next Story