Telugu Global
Others

ముందుకెళ్లండి: ఏసీబీకి ఈసీ భ‌రోసా!

 ఓటుకు నోటు ఎర కేసులో నిస్ప‌క్ష‌పాతంగా ముందుకెళ్లాల‌ని ఏసీబీకి పచ్చ‌జెండా ఊపింది. ఇప్ప‌టికే ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్న ఏసీబీకి ఇది మ‌రింత బ‌లాన్నిచ్చింది. ఈసీ నిర్ణ‌యంతో ఈ కేసును ఏసీబీ ఎలా విచారిస్తుంద‌ని అడ్డుపుల్ల వేయ‌డానికి నిన్న‌టిదాకా ప్ర‌య‌త్నించిన‌ ఏపీ సీఎం గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌ట్లైంది.  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు ఇవ్వ‌జూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో అస‌లు వాస్త‌వాలు వెలికి తీయాల‌ని, […]

ముందుకెళ్లండి: ఏసీబీకి ఈసీ భ‌రోసా!
X
ఓటుకు నోటు ఎర కేసులో నిస్ప‌క్ష‌పాతంగా ముందుకెళ్లాల‌ని ఏసీబీకి పచ్చ‌జెండా ఊపింది. ఇప్ప‌టికే ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్న ఏసీబీకి ఇది మ‌రింత బ‌లాన్నిచ్చింది. ఈసీ నిర్ణ‌యంతో ఈ కేసును ఏసీబీ ఎలా విచారిస్తుంద‌ని అడ్డుపుల్ల వేయ‌డానికి నిన్న‌టిదాకా ప్ర‌య‌త్నించిన‌ ఏపీ సీఎం గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌ట్లైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు ఇవ్వ‌జూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో అస‌లు వాస్త‌వాలు వెలికి తీయాల‌ని, దోషులెవ‌రో తేల్చాలని స‌మ‌గ్ర‌ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ఏసీబీకి , ఈసీ లేఖ రాసింది. వాస్త‌వానికి ఈకేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు అనంత‌రం మొత్తం విష‌యంపై ఎన్నిక‌ల సంఘానికి (ఈసీ) ఏసీబీ డీజీ ఏకే ఖాన్ నివేదిక స‌మ‌ర్పించారు. ఈ విష‌యాన్ని ఏపీ ఎమ్మెల్సీ నోటిఫికేష‌న్ వెలువ‌రించే సంద‌ర్భంగా ఇరు రాష్ర్టాల ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌లాల్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ఏసీబీ మాకు నివేదిక స‌మ‌ర్పించింద‌ని, దాన్ని మేం కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ)కి క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌లాల్ వెల్ల‌డించారు కూడా. అయితే ఈ విష‌యాన్ని టీడీపీ నేత‌లు ప్ర‌స్తుతం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు. ఒక‌వేళ ప్ర‌స్తావిస్తే త‌మ వాద‌న‌లో ప‌స ఉండ‌ద‌న్న విష‌యం వారికి తెలుసు కాబ‌ట్టి. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ వేం న‌రేంద‌ర్‌రెడ్డిని బుధ‌వారం దాదాపు 5 గంట‌ల పాటు విచారించిన ఏసీబీ ఇక‌పై మ‌రింత దూకుడు పెంచ‌నుంది. దోషుల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆదేశిస్తూ.. ఎన్నిక‌ల సంఘం ఏసీబీకి లేఖ రాయ‌డంతో టీడీపీలోని పెద్ద‌త‌లకాయ‌ల్లో ఆందోళ‌న చెల‌రేగుతోంది. నోటీసుల‌ను అస్స‌లు ప‌ట్టించుకోం అని నిర్ల‌క్ష్యంగా, చ‌ట్టాన్ని హేళ‌న చేస్తూ మాట్లాడిన టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల సంఘాన్ని కూడా నిందిస్తారా? చూద్దాం మ‌రి!
First Published:  17 Jun 2015 9:44 PM GMT
Next Story