Telugu Global
Cinema & Entertainment

మహేష్ కు దూరంగా రకుల్....

మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే స్టార్ హీరోల సినిమాల ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రకుల్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రవితేజకు జంటగా నటించిన కిక్ 2  చిత్రం విడుదలకు రెడీగా ఉంది. అయితే గత రెండు నెలలుగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవంలో హీరోయిన్ రకుల్ అనే వార్త వినిపిస్తూనే ఉంది. మధ్యలో కొంతమంది ఈ […]

మహేష్ కు దూరంగా రకుల్....
X
మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే స్టార్ హీరోల సినిమాల ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రకుల్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రవితేజకు జంటగా నటించిన కిక్ 2 చిత్రం విడుదలకు రెడీగా ఉంది. అయితే గత రెండు నెలలుగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవంలో హీరోయిన్ రకుల్ అనే వార్త వినిపిస్తూనే ఉంది. మధ్యలో కొంతమంది ఈ సినిమా హీరోయిన్ రకుల్ కాదంటే, ఆ సినిమా హీరోయినే నేనేంటు ఆమె చెప్పుకొచ్చింది. ఇక సుకుమార్ దర్సకత్వంలో వస్తున్న తన‌ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అని.. ఇటీవల ఓ ఆడియో వేడుకలో స్వయంగా తెలియజేశాడు ఎన్టీఆర్. దీంతో ప్రిన్స్ బ్రహ్మోత్సవం సినిమాతో పాటు ఎన్టీఆర్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించాల్సి ఉంది రకుల్. కానీ. ఒకే సారి రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేక కన్ ఫ్యూజన్ లో పడిపోయింది రకుల్. ప్రిన్స్ సినిమాకు డేట్స్ పై క్లారిటి ఇవ్వలేక పోవటంతో బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి మరో వారంలో హీరోయిన్ పేరు రివీల్ చేస్తామంటున్నారు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికో ఒకరికి నో చెప్పాల్సి రావచ్చు.
First Published:  18 Jun 2015 2:10 AM GMT
Next Story