Telugu Global
NEWS

వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్‌

తెలంగాణ‌లో అత్యంత పురాత‌న ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వేములవాడ ఆలయాన్ని సంద‌ర్శించిన ఆయ‌న క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేశారు. అనంత‌రం ఆల‌య‌ అభివృద్ధిపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధికి ప్ర‌త్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆల‌యం చుట్టుప‌క్క‌ల 10-12 కిలోమీట‌ర్ల ప‌రిధిలో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఆదేశించారు. ఏటా రూ.100 కోట్ల నిధులు సమకూర్చుతామన్నారు. ఆలయ అభివృద్ధికి శృంగేరి, కంచి పీఠాధిపతులను […]

వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్‌
X

తెలంగాణ‌లో అత్యంత పురాత‌న ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వేములవాడ ఆలయాన్ని సంద‌ర్శించిన ఆయ‌న క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేశారు. అనంత‌రం ఆల‌య‌ అభివృద్ధిపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధికి ప్ర‌త్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆల‌యం చుట్టుప‌క్క‌ల 10-12 కిలోమీట‌ర్ల ప‌రిధిలో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఆదేశించారు. ఏటా రూ.100 కోట్ల నిధులు సమకూర్చుతామన్నారు. ఆలయ అభివృద్ధికి శృంగేరి, కంచి పీఠాధిపతులను సంప్రదించే యోచనలో టీసర్కారు ఉన్నట్లు వివరించారు. వచ్చే క్యాబినెట్ సమావేశాల్లో ఆలయ కమిటీ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన భక్తుల స్థాయికి అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు లేవని, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో నాలుగైదు అంతస్తుల భవనాలను నిషేదిస్తామని తెలిపారు. సిరిసిల్ల- వేములవాడ మధ్య నాలుగు లైన్ల రోడ్డు సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

First Published:  18 Jun 2015 10:48 AM GMT
Next Story