Telugu Global
Others

కేసీఆర్‌పై విచార‌ణ చేయాల్సింది తెలంగాణ పోలీసులే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావుపై ఎన్ని కేసులు పెట్టినా ఆ కేసుల‌న్నింటిపై విచార‌ణ చేయాల్సింది తెలంగాణ పోలీసులేన‌ని మాజీ ఐపీఎస్ అధికారి ఆంజ‌నేయ‌రెడ్డి అన్నారు. సీఆర్ పీసీ ప్రకారం కేసు ఎక్కడైనా రిజిస్ట్రర్ కావొచ్చని కాని దర్యాప్తు చేసేఅధికారం మాత్రం నేరం జరిగే పరిధిలోని ఉన్న పోలీసులదేన‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిచోట్ల కేసులు రిజిస్ట్రర్ చేసుకున్నా అక్క‌డ పొలీసులొచ్చి దర్యాప్తు చేయలేరని ఆంజనేయరెడ్డి అన్నారు. చట్టాలపైఆంధ్రప్రదేశ్ మంత్రులు చెపుతున్న మాటలు సరైనవి కాదని ఆంజనేయరెడ్డి […]

కేసీఆర్‌పై విచార‌ణ చేయాల్సింది తెలంగాణ పోలీసులే
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావుపై ఎన్ని కేసులు పెట్టినా ఆ కేసుల‌న్నింటిపై విచార‌ణ చేయాల్సింది తెలంగాణ పోలీసులేన‌ని మాజీ ఐపీఎస్ అధికారి ఆంజ‌నేయ‌రెడ్డి అన్నారు. సీఆర్ పీసీ ప్రకారం కేసు ఎక్కడైనా రిజిస్ట్రర్ కావొచ్చని కాని దర్యాప్తు చేసేఅధికారం మాత్రం నేరం జరిగే పరిధిలోని ఉన్న పోలీసులదేన‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిచోట్ల కేసులు రిజిస్ట్రర్ చేసుకున్నా అక్క‌డ పొలీసులొచ్చి దర్యాప్తు చేయలేరని ఆంజనేయరెడ్డి అన్నారు. చట్టాలపైఆంధ్రప్రదేశ్ మంత్రులు చెపుతున్న మాటలు సరైనవి కాదని ఆంజనేయరెడ్డి అన్నారు. ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్న ఏసీబీ పెట్టిన ఓటుకు నోటు కేసుకు, విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్షన్-8కు సంబంధం లేదన్నారు. ఏసీబీ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఏపీ మంత్రులు సెక్షన్-8ను ప్రస్తావిస్తున్న‌ట్టు తాను భావిస్తున్నానని ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. కొన్ని అంశాలపై కేసులు మాత్రమే ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుందని, కేసు పూర్వాప‌రాలు, వివ‌రాల‌న్నీ చెప్పాల్సిన అవ‌సంర లేద‌ని ఆయ‌న అన్నారు. కేసు రిజిస్టర్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఫ‌లానా ప‌ని చేయ‌మ‌ని ముఖ్యమంత్రి, డీజీపీని ఆదేశించ‌లేర‌ని ఆంజనేయ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తులో గవర్నర్ కానీ, సీఎంకానీ, ఎన్నికల సంఘం కానీ జోక్యం చేసుకోలేదన్నారు.
First Published:  19 Jun 2015 1:05 AM GMT
Next Story